Home /News /crime /

BIHAR BLAST REPORTED IN PATNA CIVIL COURT 1 CONSTABLE INJURED PAH

క్షణాల్లోనే భయానక వాతావరణం.. కోర్టులో పేలిన బాంబు.. అసలేం జరిగిందంటే..

పాట్నా కోర్టు

పాట్నా కోర్టు

Bihar: స్వాధీనం చేసుకున్న బాంబును జడ్జి ఎదుటకు తీసుకెళ్లారు. అక్కడ టేబుల్ మీద పెట్టారు. ఇంతలో అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది.

బీహర్ లోని (Bihar) పాట్నా సివిల్ కోర్టులో (Patna civil court)  ఊహించని పరిణామం సంభవించింది. పాట్నాలోని ఒక హోటల్ లో బాంబు దొరికింది. అప్పుడు దాన్ని విచారణలో భాగంగా.. అధికారులు బాంబు పౌడర్ ఉన్న బాక్స్ ను న్యాయస్థానంలో తీసుకొచ్చారు. అప్పుడు.. జడ్జీ ముందు బెంచ్ మీద పెట్టారు. ఇంతలో షాకింగ్ ఘటన జరింది. కోర్టు ఆవరణలో బాంబు ఉన్న టిఫిన్ బాక్స్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది.

దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తిని, లాయర్ లను, అక్కడి నుంచి తరలించారు. కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో అక్కడ గందర గోళమైన వాతావరణం ఏర్పడింది.పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా గతంలోనే అమెరికాలో కాల్పులు జరిగాయి.

అమెరికా(America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.



నికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.

ఈ ప్రజలు సంబరాలు (candlelight vigil) చేసుకుంటున్నారని మరియు గాలిలో బెలూన్‌లను వదులుతున్నారని, ఒక వాహనం అక్కడికి చేరుకుని గుంపుపైకి కాల్పులు (gunfire against vigil) జరిపిందని అతను చెప్పాడు. మరణించిన వ్యక్తికి సుమారు 20-22 సంవత్సరాల వయస్సు ఉంటుందని గొంజాలెజ్ సోమవారం ఉదయం చెప్పారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Courts, Crime news, Patna

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు