Home /News /crime /

BIHAR AUTO DRIVER TAKES 5YEAR OLD FOR A RIDE ALLEGEDLY RAPES HER MS

మరో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆటోలో షికారుకు వెళ్దామని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు.అలా కొద్ది దూరం వెళ్లాక.. మూడేళ్ల చిన్నారిని ఆటో నుంచి కిందకి దింపేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

    దిశా నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. తాజాగా బీహార్‌లోని ఖరువాలో 5 ఏళ్ల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖరువాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ వీధిలో ఐదేళ్ల చిన్నారి మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఓ ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. అక్కడే పార్క్ చేసి ఉన్న తన ఆటోలోకి ఎక్కి.. చిన్నారులను తన వద్దకు పిలిచాడు. ఆటోలో షికారుకు వెళ్దామని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు.అలా కొద్ది దూరం వెళ్లాక.. మూడేళ్ల చిన్నారిని ఆటో నుంచి కిందకి దింపేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను అక్కడే వదిలేసి ఆటోలో పారిపోయాడు.

    ఇటీవలే బక్సర్,సమస్తీపూర్ జిల్లాల్లో కాలిపోయిన స్థితిలో కొంతమంది మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీని మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. దీంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్,ఆ పార్టీ నేతలు రబ్రీదేవి,తేజస్వీ యాదవ్ సుశీల్ మోదీ తీరును తప్పు పట్టారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Bihar, Disa Rape and Murder, RAPE

    తదుపరి వార్తలు