కొందరు పెళ్లి బంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. ఎన్నో ఆశలతో అత్తింటివారి ఇంట్లో అడుగుపెట్టిన కోడలిపై (Harassment) దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు అత్తలు, కోడళ్లను డబ్బులు కావాలని, పని చేయడం రాదని అనేక సాకుల చూపిస్తు వేధించడమే పనిగా పెట్టుకుంటున్నారు. మరికొందరు ప్రతి దానికి కోడలిని బాధ్యురాలిని చేస్తు అతి కిరాతకంగాను ప్రవర్తిస్తున్నారు. అయితే, వీరికి భిన్నంగా మరికొందరు తమ కోడళ్లను కన్న కూతుళ్ల మాదిరిగాను కూడా చూసుకుంటారు. అయితే, ప్రభుత్వాలు కట్నం ఇవ్వడం, తీసుకొవడం నేరమని ముందే చెప్పాయి. కొందరు మాత్రం ఇప్పటికి కట్నం కోసం కోడళ్లను (Dowry Harassment) వేధిస్తున్నారు.
ఇప్పటికీ డబ్బులు కావాలని, ఇళ్లు రాసివ్వాలని, పొలం తన పేరు మీద రాసివ్వాలని అంటూ గొంతెమ్మ కోరికలన్ని కోరుతుంటారు. ఈ క్రమంలో కొందరు అత్యంత నీచానికి దిగజారుతుంటారు. కోడళ్లను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. మరికొందరు కోడళ్లను హత్యలు చేసిన అనేక ఉదంతాలు కూడా గతంలో వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఉదంతం జరిగింది. హత్రాస్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అనిల్, పాయల్ లకు గతేడాది మే 24న పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చి, గ్రాండ్ గా పెళ్లి చేశారు. అయితే, పాయల్ అత్తింటికి వెళ్లిన కొన్ని రోజులకే వేధింపులు మొదలయ్యాయి. అత్తింటి వారు ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు. భర్త అనిల్,అత్త యశోద, ఆమె బావ మహేంద్ర సింగ్, అదనపు కట్నం తేవాలని హింసించేవారు. ఆమెను గదిలో పెట్టి అనేక సార్లు నోటికొచ్చినట్లు తిట్టాటమే కాకుండా, కొట్టారు. ఈ క్రమంలో కొన్ని రోజులు పోతే అవే సర్దుకుపోతాయని యువతి అనుకుంది. కానీ రోజులు గడుస్తున్న వీరి వేధింపులు తగ్గలేదు. మరీ ఎక్కువయ్యాయి. బుధవారం రోజున కోడలిని గదిలో బంధించారు. (woman burnt alive) ఆమె ఏడుస్తున్న ఏమాత్రం కనికరం చూపలేదు.
గదిలో పెట్రోల్ వేసి నిప్పంటించారు. ఆమెను సజీవ దహానం (Brutally murder) చేశారు. ఆమె బయటకు రాకుండా డోర్ లాక్ చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందని చూపించడానికి ప్రయత్నించారు. కాగా, బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి కరెంట్ షాక్ వలన రూమ్ లో మంటలు అంటుకున్నాయని అన్నారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చారు. బాధితురాలి తండ్రి హీరా లాల్ సింగ్ నా కూతురిని ఆమె అత్తింటి వారే చంపారని చెప్పాడు. కేవలం అదనపు కట్నం కోసమే నా కూతురిని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Dowry harassment, Female harassment, Uttar pradesh