హీరో విజయ్ ఫ్యాన్స్ బీభత్సం... షాపులకు నిప్పు

తమ ఫేవరెట్ హీరో షో వేయలేదని విజయ్ ఫ్యాన్స్ విధ్వంసానికి దిగారు. షాపులకు నిప్పు పెట్టారు.

news18-telugu
Updated: October 25, 2019, 9:15 AM IST
హీరో విజయ్ ఫ్యాన్స్ బీభత్సం... షాపులకు నిప్పు
విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్
  • Share this:
తమిళనాడులోని కృష్ణగిరిలో హీరో విజయ్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. తమ ఫేవరెట్ హీరో విజయ్ నయా మూవీ బిగిల్ స్పెషల్ షో వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధియేటర్‌ను ధ్వంసం చేయడంతో పాటు బయట ఉన్న షాపులకు నిప్పు పెట్టారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ధ్వంసం చేశారు. పోలీసు వాహనం, మున్సిపల్ వాహనాలను ధ్వంసం చేశారు. సినిమా వేసేంతవరకు తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అల్లర్లకు పాల్పడిన 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిమంది కోసం గాలింపు చేపట్టారు. బిగిల్ సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చే విషయంలో జాప్యం చేసిన ప్రభుత్వం... నిన్న సాయంత్రం ఇందుకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా బిగిల్ మూవీ షో వేయలేదని... కృష్ణగిరిలో ధియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఈ రకమైన దాడికి దిగారు.




Published by: Kishore Akkaladevi
First published: October 25, 2019, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading