పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రముఖ హీరోలను పెట్టి అవగాహనా వీడియోలను రూపొందించినా ప్రజల్లో మాత్రం సైబర్ నేరాలపై అవగాహన కలగడం లేదు. సైబర్ నేరాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త తరహా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. కంటికి కనిపించకుండా ఫోన్లలోనే మాయమాటలు చెప్పి కోట్లకు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అందిన కాడికి దోచుకుని ఫోన్లను స్విచాఫ్ చేసుకుని క్షణాల్లోనే మాయమైపోతున్నారు. బాధితులకు అంతులేని వేదనను మిగుల్చుతున్నారు. తాజాగా జరిగిన ఓ సైబర్ క్రైమ్ ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో అత్యంత పెద్ద సైబర్ నేరంగా చరిత్రకెక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 240 కోట్ల రూపాయలను ఫోన్లో కల్లబొల్లి కబుర్లు చెప్పే ఓ మహిళ నుంచి కొల్లగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనాలోని హాంగ్ కాంగ్ కు చెందిన అత్యంత ధనిక కుటుంబానికి చెందిన ఓ 90 ఏళ్ల మహిళకు గతేడాది ఆగస్టులో గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ’మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. ఓ మనీ ల్యాండరింగ్ స్కామ్ లో మీ పేరును కొందరు వాడుతున్నారు. మీ ప్రమేయం లేదనే మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దీని గురించి అప్పుడప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంటాం. మీకేం భయం లేదు. మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించే పూచీ మాది. అత్యున్నత స్థాయి అధికారులను కలిసి మీ విషయాన్ని పర్సనల్ గా మాట్లాడతాను. భయపడకండి‘ అని ఆ ఫోన్లో ఓ వ్యక్తి చెప్పాడు. మొదట్లో అతడు చెప్పింది విని భయపడిపోయిన ఆమె, ఆ తర్వాత అతడు ఇచ్చిన భరోసాతో ఊపిరిపీల్చుకుంది.
ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!
అప్పటి నుంచి పలు దఫాలుగా అతడు ఆ 90 ఏళ్ల మహిళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో ఆమెను కలవడానికి వెళ్లేవాళ్లు. పెద్ద పెద్ద అధికారులతో ఫోన్లు మాట్లాడుతున్నట్టు ఆమె ఎదుటే మాట్లాడి నమ్మించేవాళ్లు. ఈ కేసులో అత్యున్నత స్థాయి అధికారులను సంతృప్తి పరచాల్సి ఉందంటూ చెప్పి పలు దఫాలుగా ఆమెను డబ్బు డిమాండ్ చేశాడు. మాయమాటలు చెప్పి ఆమెలో నమ్మకాన్ని కల్పించి మరీ మోసానికి తెగబడ్డారు. పది సార్లు ఆమె తన ఫోన్ నుంచి అవతలి వ్యక్తి చెప్పిన అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసింది. ఇలా దాదాపుగా 32 మిలియన్ డాలర్లను (240 కోట్ల రూపాయలకుపైగానే) ఆమె పంపించింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తుల్లో ఓ మహిళకు వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఆ వృద్ధురాలి కూతురికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ కూతురు తల్లి ఇంటికి వెళ్లి ఫోన్లో బ్యాంకు ఖాతా వివరాలను చూసి కంగుతింది. వందల కోట్లలో మోసపోయామని గ్రహించింది. మార్చి 2వ తారీఖున పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మొత్తానికి ఓ 19 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి వివరాలను రాబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, China App Ban, Crime news, Crime story, CYBER CRIME, Telangana crime