పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు రాహుల్ సిప్లిగంజ్ ఫిర్యాదు..

ప్రిజమ్ పబ్‌లో దాడి ఘటనపై గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: March 5, 2020, 2:15 PM IST
పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు రాహుల్ సిప్లిగంజ్ ఫిర్యాదు..
కేటీఆర్ రాహుల్ సిప్లిగంజ్ (ktr rahul sipligunj)
  • Share this:
గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో దాడి ఘటనపై గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై కంప్లైంట్ ఇచ్చాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు. తనతో ఉన్న యువతులపైనా రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని అన్నాడు.

గత రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమె పై కొంత మంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో పక్కనే రాహుల్.. వాళ్లను నిలదీయగా.. ఆ యువకులు ఎదురు తిరిగి బీరు సీసాలతో తలపై బాదగా.. తీవ్ర రక్త స్రావంతో రాహుల్ గాయాలపాలైయ్యాడు. దీంతో పబ్ సిబ్బంది రాహుల్‌ను వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
First published: March 5, 2020, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading