Home /News /crime /

BIGG BOSS TELUGU FAME SARAYU 7 ARTS SARAYU ROY BOOKED FOR ALLEGEDLY INSULTING HINDU GODS MKS

Bigg Boss Sarayu: వివాదంలో 7arts సరయు.. ఆ వీడియోలో దృశ్యాలపై పోలీస్ కేసు

వివాదంలో సరయు

వివాదంలో సరయు

7ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్ తో పాపులరై, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొన్న సరయు ప్రస్తుతం హోటల్ రంగంలోకి ప్రవేశించారు. కానీ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు..

యూట్యూబ్ లో 7ఆర్ట్స్ చానెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 ఆర్ట్స్ టీమ్ బోల్డ్ నెస్ పేరుతో పచ్చి బూతులు మాట్లాడుతున్నారంటూ అప్పట్లో రచ్చ జరిగింది. ఆ యూట్యూబ్ చానెల్ ప్రధాన పాత్రధారి సరయుకు వచ్చిన క్రేజీ అంతాఇంతా కాదు. గతేడాది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ మెరిసిందామె. బిగ్ బాస్ తర్వాత హోటల్ వ్యాపారంలోకి దిగిన సరయు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల సరయు తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి.

సరయు తాజా రూపొందించిన పాటలోని దృశ్యాలు హిందువుల మనోభావాలను కించపర్చేలా ఉన్నాయంటూ ఫిర్యాదు దాఖలైంది. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సరయుపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ నేత ఒకరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. అనంతరం దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Video: అంబులెన్స్‌కు దారివ్వని అధి‘కారు’నేత -రోగి మృతికి TRS MLA Rega Kantha Rao కారణం కాదా?



సరయుపై చర్యలు తీసుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన హోటల్ ప్రమోషన్‌లో భాగంగా హిందువులను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Asaduddin Owaisi : ఒవైసీ నూరేళ్లు బాగుండాలంటూ 101 మేకలు బలి -Hyderabad వ్యాపారి ప్రార్థనలు



హోటల్ ప్రచార సాంగ్‌లో సరయు ఇతరులు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించి మద్యం సేవించారని.. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వీహెచ్‌పీ నేత ఆక్షేపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కేసుపై సరయు వాదన తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: 7 arts sarayu, Bigg Boss 5, Police, Sarayu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు