శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దేశంలో మహిళలకు రక్షణ కరవయిందంటూ మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులను నడి రోడ్డుప ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి ప్రియాంక హత్యను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే బయటకు వెళ్లే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా ఘటనపై స్పందించిన శ్రీముఖి.. రోడ్లపై అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Prayers to Priyanka!#JusticeForPriyankaReddy #RIPPriyanakaReddy
Please be careful ladies! pic.twitter.com/ero2P4lfW0
— SreeMukhi (@MukhiSree) November 29, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Priyanka Reddy, Priyanka reddy murder, Sreemukhi, Telangana