BIGG BOSS SEASON 15 AFSANA KHAN TRIES CUT HERSELF KNIFE DEETS INSIDE DETAILS HERE VB
Bigg Boss: షాకింగ్.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. చివరకు ఏమైదంటే..
ప్రతీకాత్మక చిత్రం
Bigg Boss: హిందీలో ఎప్పట్నుంచో బిగ్‌బాస్ కొనసాగుతుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుని 15వ సీజన్ మొదలు పెట్టింది. తాజాగా ఈ 15వ సీజన్లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే..
భారత్ లో కొన్ని రాష్ట్రాల్లో ప్రసారం అవుతున్న రియాల్టీ షోలో ఎక్కువగా పాపులారిటీ సాధించిన షో బిగ్ బాస్. వివిధ బాషల్లో ఈ షో కొనగాతున్న విషయం తెలిసిందే. అయితే కంటెస్టెంట్ల మధ్య ఎక్కువగా ఆటలు పెడుతుంటాడు బిగ్ బాస్. ఆ ఆటల్లో ఓడిపోతే స్పోర్టివ్ తీసుకొని అందరూ మళ్లీ కలిసి పోయి ముందుకు వెళ్తుంటారు. కొంతమంది ఆ గేమ్ లల్లో.. మరేదైనా ఈవెంట్లో మంచిగా చేయలేదనో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. వాళ్లు కన్నీరు పెట్టుకోవడంతో పాటు చూసే ప్రేక్షకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయినందుకు కోపంతో ఊగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అఫ్సానా ఖాన్ అనే కంటెస్టెంట్ సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే.. హౌస్ లో కెప్టెన్ చెప్పిందే ప్రతీ ఒక్కరూ వినాల్సి ఉంటుంది. ఈ వారం అక్కడ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు ఉమర్ రియాజ్. అతడికి ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ . దాని ద్వారా వీఐపీ టికెట్స్ ని అందులో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందులో అతడు కరణ్ కుంద్రా, నిషాంత్ భట్, తేజస్వి ప్రకాశ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ఇచ్చాడు. దీంతో అక్కడ జరిగే ఓ గేమ్ నుంచి అఫ్సానా ఖాన్ ని తొలగించేశారు.
దీంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో ఊగిపోతూ.. నేనే నమ్మన స్నేహితులే మోసం చేశారని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కోపంతోనే ఇంట్లో ఉన్న వస్తువులను పగలకొట్టింది. అంతే కాకుండా కత్తితో తనను తాను గాయపడరుచకోవడానికి ప్రయత్నం చేసింది. అప్రమత్తమైన ఇంటి సభ్యులు ఆమెను గట్టిగా పట్టుకొని.. ఆమె చేతిలో ఉన్న కత్తిని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. ఆ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
అఫ్సానా ఖాన్ మొదటి నుంచి వివాదాలతోనే కనిపిస్తుంది.. ఆమె తీరు ఎవరికి నచ్చడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వారం హోస్ట్ గా వ్యవహరించే సల్మాన్ ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.