హోమ్ /వార్తలు /క్రైమ్ /

Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఓ వైపు నోటీసులు..మరోవైపు రిమాండ్ పొడిగింపు

Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఓ వైపు నోటీసులు..మరోవైపు రిమాండ్ పొడిగింపు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓ వైపు నిందితుల రిమాండ్ పొడగించగా..మరోవైపు కొత్తగా మరికొంతమందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులైన  రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) లకు బిగ్ షాక్ తగిలింది. నిందితుల రిమాండ్ ను డిసెంబర్ 9వరకు పెంచుతూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. జగ్గు స్వామి సోదరునితో పాటు ఆయన సిబ్బందికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓ వైపు నిందితుల రిమాండ్ పొడగించగా..మరోవైపు కొత్తగా మరికొంతమందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) ల రిమాండ్ ను డిసెంబర్ 9వరకు పెంచుతూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. జగ్గు స్వామి సోదరునితో పాటు ఆయన సిబ్బందికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది.

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక దాడి..విచారణ కమిటీ ఏర్పాటు

జగ్గు స్వామి సోదరుడు, సిబ్బందికి నోటీసులు..

ఈ కేసులో గతంలో BL సంతోష్, తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్ అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే శ్రీనివాస్ తప్ప మిగతా ముగ్గురు విచారణకు హాజరు కాలేదు. దీనితో వారిపై సిట్ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే A1 గా రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ A2గా (Nandhakumar), సింహయాజి (Simhayaji) A3లుగా ఉన్నారు. కాగా A4గా బీజేపీ అగ్రనేత BL సంతోష్ (santosh), A5గా తుషార్ (Thushar), A6గా జగ్గుజీస్వామి (Jagguji swami), A7గా బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ (Advocate Srinivas) ను చేర్చింది సిట్. ఇక తాజాగా జగ్గుస్వామి సోదరునితో సహా ఐదుగురికి సిట్ నోటీసులు ఇచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిపాల్, అలాగే ఆయన ఆశ్రమంలోని సిబ్బంది శరత్, ప్రశాంత్ మరికొంతమందికి 41A CRPC కింద సిట్ నోటీసులు ఇచ్చింది.

TS Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.., మెడికల్ ఆఫీసర్ జాబ్స్‌కి నోటిఫికేషన్.. వివరాలివే..!

నేడు విచారణకు నందకుమార్ భార్య, అంబర్ పేట న్యాయవాది ప్రతాప్, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్..

కాగా ఈ కేసుకు సంబంధించి నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  ఈ మేరకు నందకుమార్ భార్య చిత్రలేఖ,  అంబర్ పేట న్యాయవాది ప్రతాప్ గౌడ్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ కూడా సిట్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో వీరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

అసలు కేసు ఏంటి?

గతం నెల 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావును పార్టీ మారాలని భారీ డీల్ ను రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని వారు ప్రలోభాలకు గురి చేశారు. కానీ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు దీనిని భగ్నం చేశారు. అయితే తమ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

First published:

Tags: Telangana, Telangana News, Trs, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు