Home /News /crime /

BIG TWIST IN LALITHA JEWELLERY ROBBERY CASE ACCUSED MURUGAN WENT TO SRI LANKA ALONG WITH ACTRESS SK

రూ.10 కోట్ల నగలు, నటితో శ్రీలంకకు జంప్.. లలితా జ్యువెలరీ కేసులో ట్విస్ట్

మాస్కులు ధరించి చోరీకి పాల్పడ్డ దొంగలు

మాస్కులు ధరించి చోరీకి పాల్పడ్డ దొంగలు

ముఠా నాయకుడు తిరువారూర్ మురుగన్ రూ.10 కోట్లలో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది. డబ్బుతో పాటు ఓ నటిని వెంటబెట్టుకొని అతడు లంకకు పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. మురుగన్‌కు చెన్నైలో ఖరీదైన బంగళా, ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

    తమిళనాడులో సంచలనం రేపిన లలితా జ్యువెలరీ చోరీ కేసు మరో మలుపు తిరిగింది. తిరుచ్చి లలితా జ్యువెలరీ షోరూంలో నగలను చోరీచేసిన ముఠా నాయకుడు తిరువారూర్ మురుగన్ రూ.10 కోట్లలో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది. డబ్బుతో పాటు ఓ నటిని వెంటబెట్టుకొని అతడు లంకకు పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. మురుగన్‌కు చెన్నైలో ఖరీదైన బంగళా, ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఐతే మురుగన్ స్వస్థలం తిరువారూర్‌ వెళ్లినా ఒక్క ఆధారమూ లభించలేదు. దొంగిలించిన డబ్బుతో తిరువారూర్ అభివృద్ధికి ఎంతో కృషి చేసాడని మురుగన్‌కు పేరుంది. అందుకే అతడి గురించి స్థానికులు ఏమీ చెప్పడం లేదని సమాచారం.

    అక్టోబరు 2న తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలో ఉన్న లలితా జ్యువెల్లరీ షోరూంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. సుమారు రూ.13 కోట్ల విలువైన బంగారం ఆభరణాలను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. గోడకు కన్నంవేసి షోరూం లోపలికి వెళ్లిన దుండగులు.. ముఖాలకు మాస్కులు ధరించి నగలను కాజేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. రోడ్డుపై చేసిన తనిఖీల్లో మణికంఠణ్ అనే దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4 కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠన్ విచారణలో చోరీకి సంబంధించి మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చాయి.

    లలితా జ్యువెలరీలో చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు మణికంఠన్, సీరతొప్పు సురేష్..! పోలీసులకు పట్టుబడ్డ మణికంఠన్ తమ ముఠా వివరాలను పోలీసులకు వెల్లడించాడు. సురేష్, అతడి మేనమామ పేరు మోసిన దొంగలని.. తిరువారూర్ మురుగన్ ముఠా నాయకుడని వివరించాడు. అందరం కలిసే రూ.13 కోట్లు విలువైన నగలం కాజేసామని వెల్లడించాడు. ఇక తాజాగా సురేష్ తల్లిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె వద్ద నుంచి 450 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    మురుగన్


    ఎవరీ మురుగన్..?
    తిరువారూర్‌కు చెందిన మురుగన్ పేరుమోసిన దొంగ. చదవు రాకున్నా దొంగతనాల్లో మాత్రం మనోడు చాలా ఇంటెలిజెంట్..! కోటీశ్వరుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్న మురుగన్.. ఏటీఎంలు, బ్యాంకులు, నగల షాపులను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడ్డాడు. 2008లో కొందరితో కలిసి ముఠా ఏర్పాటుచేసిన అతడు.. ఆ తర్వాత బెంగళూరు, తెలంగాణ, ఏపీ, తమిళనాడు సహా చాలా ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. దొంగతనాలే కాదు.. మురుగన్‌కు సినిమాలన్నా పిచ్చి. అందుకే చోరీ చేసిన సొత్తులో పలు సినిమాలను కూడా నిర్మించాడు. బాల మురుగన్ ప్రొడక్షన్ పేరుతో మనసా వినవే, ఆత్మ చిత్రాలను తీశాడు. ఐతే అవి మధ్యలోనే ఆగిపోయాయి. దొంగతనం చేసిన డబ్బును ఎక్కువగా విలాసాలకే ఖర్చు చేసేవాడు మురుగన్. డబ్బు ఆశచూపి పలువురు హీరోయిన్లను లైంగికంగా వాడుకున్నాడని.. అతడికి ఎయిడ్స్ వ్యాధి కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
    First published:

    Tags: Crime story, Lalitha jewellery robbery, Tamil nadu, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు