Twist in Marriage: కొన్ని గంటల్లో పెళ్లి. సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు.. ఏం చేసిందో తెలుసా..?

పెళ్లికి ముందు ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు

Marriage twist: కాసేపేట్లో వివాహం జరుగుతోంది అనగా.. పెళ్లి కూతురు అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. కళ్యాణ మండపంలో ఉండాల్సిన ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.. ఏం జరిగిదంటే..?

 • Share this:
  Bride Marriage twist: కొన్ని గంటల్లో పెళ్లి.. వివాహ (Marraige) సందడి కూడా మొదలైంది.. మూడుముళ్ల తతంగానికి చాలా మంది తరలి వచ్చారు కూడా.. ఇక పెళ్లిమండపంలో అంతా ఆసీనులు అవ్వాల్సిన సమయం.. కానీ అంతలోనే సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చింది పెళ్లి కూతురు. అంతా మండపానికి చేరుకుంటున్నారు.. కానీ అక్కడ ఉండాల్సిన వధువు మాత్రం కనిపించ లేదు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు.. వధువు (Bride) ఏదని ఆరా తీసి.. అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు. సాధారణంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే కన్నవాళ్లకు చెప్పుకుంటారు. ఎదో ఒకలా చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. అదీ కుదరకుంటే బంధువుల ముందు చెప్పుకుని భోరుమంటారు. అదీ కుదరకపోతే స్నేహితులకైనా చెపుతారు. అలా ఎవరికీ చెప్పుకునే అంత ధైర్యం లేదేమో అని అనుకుంటే మీరు పొరబడ్డట్టే.. ఎందుకంటే ఆ యువతి అత్యంత ధైర్యంగా వ్యవహరించింది. 22 ఏళ్ల పెళ్లి కూతురు పెళ్లి పీటలపైకి ఎక్కే సమయానికి ముందు సరిగ్గా డయల్ 100కి కాల్ చేసి పోలీస్ కంట్రోల్‌ రూమ్‌‌కి ఫిర్యాదు చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కాపాడాలని విశాఖపట్నం (Visakhapatnam) అరిలోవ ప్రాంతానికి చెందిన ఈ కొత్త పెళ్లి కూతురు ఇంట్లో వాళ్లకి తెలియకుండా పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్టయిన పోలీసులు యువతి దగ్గరికి వెళ్లి ఆమెను సేఫ్‌గా పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

  ఈ ఘటన విశాఖపట్నంలోని ఆరిలోవలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయి. కొన్ని రోజులుగా మధన పడింది. ఆ పెళ్లి నుంచి తప్పించుకోడానికి ఏం చేయాలా అని ఆలోచించి.. ఇలా డయల్ 100కి ఫోన్ చేసింది. అయితే ఏం జరుగుతుందో తెలియన ఆమె పేరెంట్స్ షాక్ లోకి వెళ్లారు. పూర్తి వివారాలు తెలిసే సరికి అవాక్కయ్యారు. ఎందుకిలా చేశావని కన్నకూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ వద్దకు వచ్చిన యువతి బంధువులు.. ఇష్టం లేకపోతే పెళ్లి మానేస్తామని ఇంటికి రావాలంటూ యువతిని కోరినప్పటికీ ఇంటికి వెళ్లేందుకు సదరు యువతి భయపడుతున్నానంటూ పోలీసులకు చెప్పింది.

  ఇదీ చదవండి: భారత అమ్ముల పొదిలో మరో ఆయుధం.. ఈ విగ్రహ ప్రత్యేక ఏంటో తెలుసా..? రేపు జాతికి అంకితం

  ఇక, సీన్ పెళ్లి మండపం నుంచి పోలీస్ స్టేషన్‌కి మారిన నేపథ్యంలో.. అంతలోనే పెళ్లి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు మహిళా సంఘాలు కూడా ఠాణాకి వచ్చేశాయి. యువతికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాయి. కానీ పెళ్లి కూతురు పెళ్లి పీటలెక్కేందుకు ససేమిరా అంది. పెళ్లి కూతురు చెప్పిన రీజన్‌ విని చివరికి మహిళా సంఘాలు కూడా యువతికే మద్దతిచ్చాయి. ఇక, బంధువులు మాత్రం.. పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పాల్సింది. యువతి మాత్రం ధైర్యం చేయలేకపోయింది. చివరకు కుటుంబాన్నంతా స్టేషన్‌ మెట్లెక్కేలా చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్నీ సక్రమంగా జరిగి ఉంటే, రాత్రి విజయనగరం జిల్లా నెలిమర్లలో యువతి వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉండడంతోనే ఇలాంటి డ్రామా ఆడిందని బంధువులు అనుమానిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: