హోమ్ /వార్తలు /క్రైమ్ /

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi | Hyderabad

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా..ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో మొత్తం ఏడుగురి నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది.  కాగా ఈ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా మిగతా వారిని మాత్రం అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో నేడు కోర్టు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా..ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

Metro Employees Strike: హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల సమ్మె..జీతాలు పెంచాలని విధుల బహిష్కరణ..ప్రయాణికుల ఇక్కట్లు

ఈడీ రిపోర్టులో సంచలన విషయాలు..

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. వివరాల ప్రకారం..ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు సుమారు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.. అలాగే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారు. హోల్ సెలర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్ లో తేలింది. పాలసీ తయారికి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతికి వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలను వాట్సప్ ద్వారా పంపించారని తెలుస్తుంది. అలాగే విజయ్ నాయర్ ఢిల్లీ ఉన్నతాధికారిగా చెప్పుకున్నట్లు సమాచారం.

169 చోట్ల సోదాలు..34 మంది పాత్ర 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఇందులో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటకు రాగానే ఈ 34 మంది 140 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.

First published:

Tags: Delhi, Delhi liquor Scam, Enforcement Directorate

ఉత్తమ కథలు