హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Breaking News: ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం

Breaking News: ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం

వెలికితీసిన మృతదేహాలు

వెలికితీసిన మృతదేహాలు

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మొదట ఒక వ్యక్తి ట్యాంక్ ను శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు. ఇది గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.

Cow Hug Day: ఇక నుంచి ఫిబ్రవరి 14 కౌ హగ్ డే .. విధిగా జరుపుకోవాలని యానిమల్ లవర్స్‌కి పిలుపు

కాగా రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేయడానికి కార్మికులు పని చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ట్యాంకర్ అవ్వడంతో ఓ కార్మికుడు ట్యాంకర్ ను నిచ్చెన సహాయంతో శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఒక్కసారిగా ట్యాంకర్ లో పడిపోయాడు. దీన్ని గమనించిన మిగతా కార్మికులు అతడిని కాపాడే క్రమంలో అందులోకి దిగారు. ట్యాంక్ భారీ మొత్తంలో ఉండడంతో కార్మికులకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ట్యాంక్ నుండి పైకి ఎక్కడానికి వీలు కాకపోవడంతో వారంతా అందులోనే మృతి చెందారు. ఇక మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. మొచ్చంగి కృష్ణా తండ్రి జంపన్న, మొచ్చంగి నర్సింగ, మొచ్చంగి సాగర్, కూరతాడు బంజుబాబు, కుర్ర రామారావు, పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదీశ్, ప్రసాద్ గా గుర్తించారు.

AP Politics: YCP ఎమ్మెల్యేకు షాక్ .. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని ద్రోహీ అంటూ మంగళగిరి ఓటర్ల నిలదీత

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీకి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. వారి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  కాగా ఈ ప్రమాద సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీని ఆధారంగా పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.  ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఏడుగురు కార్మికుల మృతితో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం పనికొస్తే ప్రాణమే పోయిందని గుండెలవిసేలా బంధువులు రోదిస్తున్నారు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Crime, Crime news

ఉత్తమ కథలు