Andhra Pradesh: కాసేపట్లో కూతురి పెళ్లి.. కానీ ఊహించని విషాదం.. తల్లిదండ్రుల మృతి వెనుక సంచలన నిజాలు

కాసేపట్లో కన్యాదాణం అంతలోనే విషాదం

Marriage tragedy: మరి కాసేపట్లో వివాహ తతంగం ముగుస్తుంది. అమ్మాయిని అంతవారింటికి అప్పగింతలు చెప్పాలి.. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విషాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..?

 • Share this:
  Tragedy In Marriage: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఓ వివాహ(Marraige) వేడుకలో విషాదం (Tragedy)చోటు చేసుకుంది. వివాహం ఎంతో సందడిగా సాగుతోంది. వచ్చిన బంధువుల ముచ్చట్లు.. సన్నాయి మేళం.. చిన్నారుల ఆటలు.. వీడియో, ఫోటో గ్రాఫర్లతో ఇలా మండపం అంతా సందడిగా ఉంది. వేద మంత్రాల మధ్య ఆ జంటకు పెళ్లి జరుగుతోంది. కాసేపట్లో ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ఘట్టం కో్సం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఫంక్షన్‌ హాల్‌ (Function Hall)నుంచి వారి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానానికి సమయం అయ్యింది.. పెళ్లి కూతురు తల్లి దండ్రులు ఏరి అంటూ పురోహితులు ప్రశ్నించగా.. ఎక్కడా వారి జాడ కనిపించలేదు. దీంతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కోసం బంధువులు కళ్యాణ మండపం పరిశర ప్రాంతాలు అంతా వెతికారు. రూమ్ లు అన్నీ వెతికి చూశారు. కానీ ఎక్కడా వారి జాడ కనిపించలేదు. ఏమైందని అంతా భయపడుతూ ఆ దంపతుల కోసం ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు. దంపతులు ఇద్దరూ మృతి చెంది ఉండడం చూసి అంతా షాక్ కు గురయ్యారు. విశాఖపట్నం (Visakhapatnma) జిల్లా మద్దిలపాలెం (Maddilapalem)లో ఈ ఘటన జరిగింది. కన్న కూతురి వివాహం జరుగుతుందనగా..వధువు తల్లిదండ్రులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. అసలు వీరు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని అంతా నిట్టూరుస్తూ కన్నీరు కార్చారు. మృతులు విశాఖ పోర్టు రిటైర్డ్ ఉద్యోగి 63 ఏళ్ల జగన్నాథరావు, 57 ఏళ్ల విజయలక్ష్మి లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని భావించారు. బంధువులు కూడా అదే చెప్పారు. తనకు మందులు వేయడానికని ఇంటికి తీసుకెళ్లాలని తండ్రి జగన్నాథరావుకు ఆమె చెప్పగా.. ఇంటికి వెళ్లారని పెళ్లికూతురు చెప్పింది. దీంతో ఇద్దరూ ఇంటికి వెళ్లారని.. మళ్లీ తిరిగి వస్తారని ఎదురు చూశామని.. అయితే.. చాలా సేపటి వరకు రాకపోయే సరికి కుటుంసభ్యులు వారింటికి చేరుకున్నారన్నారు. ఇంటికి వెళ్లి చూడగా..ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు. దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తుచేశారు.

  పోలీసుల దర్యాప్తుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు తల్లి గత 15 సంవత్సరాలుగా మానసిక సమస్యతో బాధ పడుతున్నారని, 26వ తేదీ ఉదయం పెళ్లిలో భార్య భర్తల మధ్య వివాదం తలెత్తిందని గుర్తించారు. ఈ ఘటనపై జగన్నాథరావు తమ్ముడు కుమారుడు స్పందించారు. పెద్దమ్మ అనారోగ్యంతో ఉన్నా.. చాలాకాలం భరించారని, పెదనాన్నచాలా మంచివారన్నారు. వీరి మధ్య ఎలాంటి విబేధాలు మాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెళ్లి మండపంలో జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. పెళ్లిలో అన్యయ్యను తిడుతుంటే..అక్క సర్ధి చెప్పిందని, గొడవ ఎక్కువ కావడంతో…అమ్మను ఇంటికి తీసుకెళ్లి..మందులు వేయాలని అక్క చెప్పిందన్నారు. తరువాత ఇంటికి తీసుకెళ్లారని, ఎంతసేపటికీ రాకపోవడంతో…ఇంటికి వెళ్లి చూసేసరికి…వారు చనిపోయి ఉన్నారని ఆయన తెలిపారు.

  ఇదే చదవండి: సీఎం ఎక్కడుంటే అక్కడే.. సిమ్లాలో విజయసాయి.. కోర్టు అనుమతి ఇచ్చిన రోజే ఫుల్ జోష్

  అయితే స్థానికులు, బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. భార్యను భర్తే ఆవేశంలో హత్య చేసి ఉంటాడని.. ఆ తరువాత పరువు పోతుందని.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనతో వధువు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది.
  Published by:Nagesh Paina
  First published: