హోమ్ /వార్తలు /క్రైమ్ /

Express Robbery: తెలివిమీరుతున్న దొంగలు.. సిగ్నల్ వైర్ కట్ చేసి మరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ

Express Robbery: తెలివిమీరుతున్న దొంగలు.. సిగ్నల్ వైర్ కట్ చేసి మరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ

Express Robbery: ఏపీలో దొంగల హల్ చల్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, పోలీసులు నిఘా గట్టిగా ఉండడంతో.. దొంగలు రూటు మారుస్తున్నారు.. కొత్త కొత్త మార్గాల్లో దోపీడీ చేస్తున్నారు. తాజాగా ఓ ఎక్స్ ప్రస్ టైన్ సిగ్నల్ వైర్ కట్ చేసి మరీ భారీ దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

  Seven Hills Express Robbery: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో దొంగల భయం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఎక్కడో ఓ చోట దోపీడీ భయపెడుతున్నాయి. ఓ వైపు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘా పెరిగింది. అయినా దొంగతనాలకు (Robbery) బ్రేక్ లు పడడం లేదు. దొంగలు సైతం చాలా తెలివిగా వ్యవహిరుస్తూ రూటు మారుస్తున్నారు. తాజాగా ఏపీలో అర్ధరాత్రి ఓ భారీ దోపిడి కలకలం రేపింది. తిరుపతి (Tirupati) నుంచి సికింద్రాబాద్‌ (Secundrabad)కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో శుక్రవారం అర్దరాత్రి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. కొందరు దుంగల ముఠా.. పథకం ప్రకారం రైలును ఆపేశారు.. ఆ ట్రైన్ ఆగిన తరువాత.. అంతా నిద్రలో ఉండడంతో గుట్టుచప్పుడు కాకకుండా కాజేశారు. ఎవరికైనా మెలుకవ వచ్చి ప్రశ్పిస్తే బెదిరింపులకు దిగారు. అనంతపురం (Anantapur) జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసకుంది. అయితే ఈ దోపీడీ కోసం దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. మొదట దుండగులు సిగ్నల్‌ తీగలను కత్తిరించారు. దీంతో సెవన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌ తురకపల్లి స్టేషన్‌ సమీపంలో ఆగిపోయింది. వెంటనే దుండగులు ట్రైన్ ఎక్కారు. వారి దగ్గర ఉన్న మారణాయుధాలతో బెదిరింపులకు దిగి రెండు బోగీల్లో నిలువు దోపిడీ చేశారు.

  ట్రైన్ లో ఉన్న ఎస్ 5, ఎస్ 7 బోగీల్లోనే చోరికి పాల్పడ్డారు. కొందరికి నిద్ర నుంచి మెలుకవ వచ్చేసరికి నిలువదోపిడీ పూర్తి అయ్యింది.

  చాలామంది ప్రయాణికుల నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఈ దోపిడీలో ఎంత మొత్త పోయింది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రయాణికులు చెబుతున్నదాన్ని బట్టి సుమారుగా 9 తులాల బంగారం, పలు వస్తువులు, నగదును దోచుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ సమాచారం అందుకున్న రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం తురకపల్లి స్టేషన్‌ మాస్టర్‌ రైలుకు సిగ్నల్‌ ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  ఇదీ చదవండి : ఏపీలో పవర్ హాలీడే పై పారిశ్రామిక వేత్తల ఆందోళన

  ఇటీవల ట్రైన్ లను టార్గెట్ చేస్తున్న క్రైమ్ సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరి 14న సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ Sampark Kranti Express train యశ్వంతపూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుండగా మధ్య ప్రదేశ్ Madhya Pradesh రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ యువతిని సాయం పేరిట మభ్యపెట్టిన కిరాతకుడు రైలులోనే molestationకి పాల్పడ్డాడు యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో వంట చేసే Bogieలో ఖాళీ ఉందని అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వంట చేసే భోగి దగ్గరకు వెళ్లగా అందులో ఉన్న వారు వెంటనే తలుపు తెరవలేదు. పోలీసుల ఒత్తిడితో అరగంట తర్వాత తెరిచారు. అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న బాధితురాలిని పోలీసులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Theft, Train

  ఉత్తమ కథలు