హోమ్ /వార్తలు /క్రైమ్ /

Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..ఎట్టకేలకు ఆ ముగ్గురిపై కేసు నమోదు

Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..ఎట్టకేలకు ఆ ముగ్గురిపై కేసు నమోదు

BL సంతోష్ పై కేసు నమోదు

BL సంతోష్ పై కేసు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు కేరళకు చెందిన తుషార్, జగ్గూజిపై కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ (Bjp)కి భారీ షాక్ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ పై సిట్ (Special Investigation Team) అధికారులు కేసు నమోదు చేసి మరోసారి నోటీసులు ఇచ్చారు. అంతేకాదు కేరళకు చెందిన తుషార్, జగ్గూజిపై కూడా సిట్ (Special Investigation Team) కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈనెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.

TS SI, Constable Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఈవెంట్స్, తుది పరీక్ష తేదీలివే.. ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే?

గతంలో కూడా నోటీసులు కానీ..

ఈ కేసుకు సంబంధించి BL సంతోష్ కు సిట్  (Special Investigation Team) నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. ఈనెల 16న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆ నోటీసులు ఆయనకు అందాయో లేదో సమాచారం తెలియరాలేదు. ఈనెల 21న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బిఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీనితో నోటీసులు అందాయో లేదో అన్న అనుమానం నెలకొంది. ఈ క్రమంలో నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చినా ఎందుకు రావడం లేదు. గడువు కావాలని కోరుతున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అని ప్రశ్నించింది. అయితే BL సంతోష్ ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. అయితే మళ్లీ బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వాలని వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని సిట్  (Special Investigation Team) కు కోర్టు తెలిపింది.

KCR: టీఆర్ఎస్‌తో కమ్యూనికేషన్ గ్యాప్.. సీపీఐ నేత కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ పట్టించుకోవడం లేదా ?

తాజాగా మరోసారి నోటీసులు..

నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ సిట్ అధికారులు BL సంతోష్ కు అలాగే కేరళకు చెందిన జగ్గుజీస్వామి, తుషార్ కు కూడా నోటీసులు ఇచ్చారు. అలాగే సంతోష్ తో పాటు జగ్గుజీస్వామి, తుషార్ పై కేసు నమోదు చేశారు.

సిట్ సరైందేనా..సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమా?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ ఆనంద్ తో సహా పలువురితో కలిపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయడం సరైందేనా. లేక హైకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందా లేక సీబీఐకి కేసు అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేడు జరిగిన విచారణ అంతా సంతోష్ చుట్టూనే తిరుగుతుంది. నేటి విచారణకు BL సంతోష్ కానీ అతని న్యాయవాది గాని రాలేదు. అయితే ఎలాగైనా సంతోష్ ను విచారణకు రప్పించాలని సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై ఈనెల 30వ తేదీన హైకోర్టు  (High Court) ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

First published:

Tags: Bjp, Telangana, Telangana News, Trs, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు