హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sex Racket: టాప్ మోడల్, టీవీ నటి అరెస్టు.. గంటకు లక్ష వసూలు!

Sex Racket: టాప్ మోడల్, టీవీ నటి అరెస్టు.. గంటకు లక్ష వసూలు!

టాప్ మోడల్, టీవీ నటి అరెస్టు (ప్రతీకాత్మక చిత్రం)

టాప్ మోడల్, టీవీ నటి అరెస్టు (ప్రతీకాత్మక చిత్రం)

Sex Racket: ఈ మధ్య సెక్స్ రాకెట్లు ఎక్కువైపోతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఓ టాప్ మోడల్‌, ఇద్దరు టీవీ నటీమణులను పట్టుకుంది. ఐతే... తెర వెనక కథ వేరే ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Sex Racket: ఓ వైపు పోర్న్ రాకెట్ నడిపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు సరికొత్త పోర్న్ రాకెట్లు తెరపైకి వస్తున్నాయి. ముబైలోని జుహు హోటల్‌లో కొత్త రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. టాప్ మోడల్, టీవీ నటిగా గుర్తింపు పొందిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె స్వయంగా సెక్స్ రాకెట్ ప్రారంభించినట్లు గుర్తించారు. జుహు హోటల్ మామూలుది కాదు ఫైవ్ స్టార్ హోటల్. అలాంటి హోటల్‌లో ఆమె సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు తెలుస్తున్నా... క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం... ఇది సెక్స్ రాకెట్ కాదనీ... రెస్క్యూ ఆపరేషన్ అని చెబుతున్నారు. అరెస్టైన మహిళ పేరు ఇషా ఖాన్ అని తెలుస్తోంది. ఆమె స్వయంగా ఈ రాకెట్ నడుపుతున్నానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకపోవడంతో... డబ్బు కోసం ఈ రాకెట్ ప్రారంభించానని ఆమె చెప్పినట్లు తెలిసింది.

ముంబై పోలీసులకు కొంత కాలంగా ఎవరో యువతి ఇలాంటి సెక్స్ రాకెట్ నడుపుతోందనీ... మగవాళ్లతో సంబంధం లేకుండా ఆమె ఒక్కత్తే అంతా చేస్తోందనే సమాచారం ఉన్నా... పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా జుహూ హోటల్‌లో ఆమె ఇలా చేస్తోందని కచ్చితమైన సమాచారం రావడంతో... పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులే కస్టమర్లలా ఇషా ఖాన్‌కు కాల్ చేశారు. ఆమె వాట్సాప్ నంబర్ తీసుకుంది. ఆ నంబర్‌కు కొందరు అమ్మాయిల ఫొటోలు పంపింది. పోలీసులు ఇద్దరు అమ్మాయిల ఫొటోలను సెలెక్ట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి మోడల్ కాగా... మరో అమ్మాయి టీవీ సీరియల్స్ నటి.

ఇది కూడా చదవండి: అమ్మాయిలతో నగ్నంగా నిలబెట్టించే గ్యాంగ్. బాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్!

ఇద్దరు అమ్మాయిలూ చాలా కాస్ట్‌లీ అనీ... గంటకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని కోరింది ఇషాఖాన్. చెరో గంట చొప్పున ఇద్దరికీ రూ.2 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టింది. మరీ అంత రేటు ఎందుకని పోలీసులు అడిగితే... తనకేమీ మిగలదనీ... ఆ రూ.2 లక్షల్లో తాను రూ.50వేలు మాత్రమే తన కమీషన్‌గా తీసుకుంటానని తెలిపింది. మిగతా డబ్బు ఆ అమ్మాయిలే తీసుకుంటారని చెప్పింది. అమ్మాయిలను ఎక్కడ కలవాలి అని అడిగితే... జుహు హోటల్‌ దగ్గరకు రమ్మని చెప్పింది. గురువారం రాత్రి... ఇషాఖాన్‌తోపాటూ... హోటల్ దగ్గర ఎదురుచూస్తున్న ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి:Prostitution: హైటెక్ సెక్స్ రాకెట్.. విమానాల్లో అమ్మాయిల రవాణా!

ఇషా ఖాన్‌తోపాటూ అరెస్టైన ఇద్దరు కూడా అదే మాట చెప్పారు. కరోనా వల్ల తమ ఉపాధి పోయిందనీ... డబ్బు కోసమే ఈ వృత్తిలోకి దిగామని చెప్పారు. వాళ్లను రెస్క్యూ హోమ్‌కి తరలించిన పోలీసులు... దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

First published:

Tags: Crime news, Mumbai, Sex Racket

ఉత్తమ కథలు