Home /News /crime /

BIG SCAM IN ANDHRA PRADESH SECRETARIAT ACB FILED CASE SUSPECTS SOME POLITICIANS INVOLVEMENT NGS

Big Scam: సచివాలయంలో భారీ స్కామ్.. ప్రజా ప్రతినిధుల సిబ్బంది పాత్ర..! ఏసీబీ అదుపులో అనుమానితులు

ఏపీ సచివాలయం (ఫైల్)

ఏపీ సచివాలయం (ఫైల్)

Scam In AP secretariat: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదలు, లబ్ధి దారుల నుంచి డేటా తీసుకుని.. వారి పేరుతో CM రిలీఫ్‌ ఫండ్ నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది కుమ్మక్కయి గూడుపుఠాణీ నడిపిట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Big Scam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయం(secretariat)లో భారీ స్కామ్ ను ఏసీబీ(ACB) గుట్టు రట్టు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి (CM Relief Fund) సంబంధించిన నిధుల గోల్ మాల్ భారీగా జరిగినట్లుగా విచారణలో గుర్తించారు. సచివాలయంలోనే పని చేసే కొందరు సిబ్బంది పేదలు, లబ్ధిదారుల డేటా సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధులు పక్క దారి పట్టించారని నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో సచివాలయ సిబ్బందితో పాటుగా ప్రజా ప్రతినిధులు పీఏలు .. వారి అనుచరుల పాత్ర పైనా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే సీఎంఆర్ఎఫ్ (CMRF) అధికారులు ఫిర్యాదు చేసారు. దీంతో..రంగంలోకి దిగిన ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. నకిలీ బిల్లులను (Fake Bills) క్రియేట్ చేసి వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తేల్చారు. ఈ వ్యవహారం లో దాదాపు 50 మంది వరకు ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఏసీబీ ఈ వ్యవహారం పైన విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు అధికారులు..సిబ్బందిని విచారించారు. మరి కొందరు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. దీంతో విడతల వారీగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ఇప్పుడు ఏసీబీ మరో సారి నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇద్దరు కీలక సిబ్బందిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

    ఈ మొత్తం వ్యహారంలో కొందరు ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది ప్రమేయం సైతం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, వారెవరనేది మాత్రం పేర్లు బయటకు రావడంలేరదు. గతంలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే వద్ద పని చేసే సిబ్బంది పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక, ఇప్పుడు సచివాలయంలోనే పని చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును పక్క దారి పట్టించిన ఇంటి దొంగల పైన ఏసీబీ ఫోకస్ పెట్టింది.

    ఇదీ చదవండి: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తారంటూ లోకేష్ ఫైర్

    ఈ కేసులో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం సచివాలయం అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని వెనుక ఉన్నదెవరు...ఎవరి సహకారంతో జరిగింది.. ఇందులో పాత్ర ధారులు ఎవరనే అంశం పైన ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

    ఇదీ చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పి.. కుప్పంలో వైసీపీ గాలి దేనికి సంకేతం

    ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన వారు వీరే.. 1)చలువాది సుబ్రమణ్యం (A1),ఆఫీసు సబ్ ఆర్డినేట్, CMRF ఆఫీసు, 2)సోక రమేష్ (A2), ఆఫీసు సబ్ ఆర్డినేట్, రెవెన్యూ సెక్షన్, సెక్రటేరియట్, 3) చదలవాడ మురళి కృష్ణ (A3), ప్రైవేట్ వ్యక్తి, 4) కొండేపూడి జగదీష్ ధనరాజు (A4), ప్రైవేట్ పిఏ, MLA’s EG Dt.. ఈ నలుగురిని ACB ఆధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: ACB, Andhra Pradesh, AP News, AP Politics, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు