విశాఖపట్నం (visakhapatnam) మహా నగరానికి ఏమైంది. రోజు రోజుకూ అగ్ని ప్రమాదాలు పెరగడం భయపడెతోంది. ఇటీవల తరచూ భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుంటున్నారు స్థానికులు.. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతున్న విశాఖలో ఇలాంటి ప్రమాదాలు పెరగడం ఆందోళనకరంగా మారింది. తాజాగా విశాఖ జిల్లా దువ్వాడలోని సెజ్‌లో (visakhapatnam duwwada sez) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్ర్కాప్ పరిశ్రమ (pooja scrap factory)లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడడం.. దట్టంగా పొగలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేత పెట్టుకున్నారు స్థానికులు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు వ్యాపించినట్లు యాజమాన్యం చెబుతోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల విశాఖ పట్నంలో వరుస ప్రమాదాలు భయపడలేలా చేస్తున్నాయి. గతేడాది మే నెల ఏడో తేదీన విశాఖ జిల్లాలోనే ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి భారీగా నష్టం జరిగింది.ఈ ఘటన కేవలం మన ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన పెరిగేలా చేసింది. రెండు గ్రామాలు ఈ ఘటన వల్ల తీవ్రంగా ప్రభావితం చెందాయి. పదకొండు మంది ఈ ప్రమాదం బారిన పడి చనిపోయారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్యాస్ ప్రభావానికి లోనై మనుషులంతా ఎక్కడికక్కడ పడిపోయారు. పశువులు, పక్షులు, చివరకు తాగే నీరు కూడా గ్యాస్ ప్రభావానికి గురయ్యాయి. ఘటన జరిగిన తర్వాత అత్యంత వేగంగా స్పందించిన ఏపీ సర్కారు, బాధితులను ఆదుకోవడంలో కూడా ఉదారతను చాటుకుంది. ఈ ఘటన వల్ల మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేయడం గమనార్హం.
ఇలా వరుస ప్రమాదాలలో ఇటు ప్రభుత్వం పెద్దలు, స్థానిక అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అతి త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధానిని మార్చాలని జగన్ సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అన్ని కుదిరితే రెండు నెలలోపే విశాఖ నుంచే జగన్ పాలన ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో ప్రమాదాలు పెరగడం విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు ఇంకాస్త అప్రమత్తమ్యారు. విశాఖ నగరం చుట్టూ భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. చాలాచోట్ల నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో మరోసారి అధికారులు ఆయా కంపెనీలపై కరొడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అన్ని పరిశ్రమలను తనిఖీలు చేసి.. ఎవరైనా నిబంధనలు పాటించని పక్షంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానికులు మాత్రం ఇలాంటి ప్రమాదంలో పెరగకుండా చూడాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fire Accident, Fire broke out, Visakha, Visakhapatnam, Vizag