Home /News /crime /

BHUBANESWAR YOUTH EXTORTS CASH GOLD FROM MINOR GIRL THREATENS TO MAKE OBSCENE VIDEO VIRAL PAH

Shocking: కొంప ముంచిన ఫేస్ బుక్ పరిచయం.. తన కోరిక తీర్చాలని బాలుడి వేధింపులు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha: భువనేశ్వర్ లో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఫేస్ బుక్ తో పరిచయం అయిన యువకుడు, బాలికకు మాయమాటలు చెప్పాడు. కొంత కాలం తర్వాత వారు పర్సనల్ గా కలుసుకునే వారు.

Bhubaneswar Youth extorts cash gold from minor girl: ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలు, యువతులు వేధింపులకు గురౌతున్నారు. అసలు... అవతల వైపు ఉన్నది.. ఎవరో కూడా తెలియని వారు.. పంపిన రిక్వెస్ట్ లను యాక్స్ ప్ట్ చేసి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు.  కొందరు దీన్ని ఒక బిజినెస్ గా చేస్తున్నారు. యువతుల డీపీలతో రిక్వెస్ట్ పెట్టి, హస్కీగా మాట్లాడించి, ఆ తర్వాత.. అవతలి వారిని ముగ్గులోనికి లాగుతున్నారు. వారి బలహీనతలను క్యాష్ చేసుకొని అందినకాడికి దోచుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.

మరికొందరు పరిచయం చేసుకొని కొంత కాలం బాగా మాట్లాడి, ఆ తర్వాత.. న్యూడ్ కాల్స్ అంటూ విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. కొంత మంది యువతులకు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టి ఆ తర్వాత.. వారి ఫోటోలను, వీడియోలను సంపాదించి వారిని వేధిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ఒడిశాలో జరిగింది.

పూర్తి వివరాలు.. భువనేశ్వర్ పరిధిలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికకు.. దెంకనల్ జిల్లాకు చెందిన ఆశిష్ జెనా అనే యువకుడు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టాడు. సదరు బాలిక దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత నంబర్ ను తీసుకున్నారు. కొన్ని రోజులు వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో వీరి ఫోటోలను అతను తీసుకున్నాడు. తర్వాత.. నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు.

తనకు డబ్బులు ఇవ్వాలని బాలికను బెదిరించాడు. బంగారం ఇవ్వకపోతే.. నీ ఫోటోలు ఫేస్ బుక్ లో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. ఆ తర్వాత.. ఆమె దగ్గర నుంచి దశల వారిగా.. 1.5 లక్షలను తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తనకు ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు దిగాడు. తన కోరిక తీర్చకుంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు.  అతగాడి వేధింపులు..  మరీ ఎక్కువ కావడంతో బాలిక ఇంట్లో వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు .. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు.

3 Minor Girls Drown In A Well In Madhya Pradesh

మధ్య ప్రదేశ్ లోని దేవాస్ లో దారుణఘటన జరిగింది. మేకలను మేపడానికి వెళ్లిన ముగ్గురు బాలికలు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన జిల్లా కేంద్రానికి 90 కిలో మీటర్ల పరిధిలో జరిగింది. కాంటాఫోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేసున్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మేకలను మేపే ప్రదేశానికి దగ్గరలో ఒక బావి ఉంది. అది చాలా లోతుగా ఉంది. అయితే, సాయంత్రం అయిన బాలికలు ఇంటికి రావపోవడంతో వారి తల్లిదండ్రులు ఆయా ప్రాంతాలలో తమ బిడ్డల కోసం వెతికారు.

ఈ క్రమంలో బావిలో చూడగా.. అక్కడ నీళ్లలో తేలుతూ వీరు విగత జీవులుగా కన్పించారు. వెంటనే వారు తమ బిడ్డలను నీళ్లనుంచి బైటకు తీశారు. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికలు ప్రమాద వశాత్తు నీళ్లలో పడ్డారా.. ఎవరైన ఏదన్నా చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Facebook friend, Harassment, Odisha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు