హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lady Khiladi : ఆమె చేతిలో మంత్రులు,ఎమ్మెల్యేలు,వీఐపీల న్యూడ్‌ వీడియోలు .. ఎంత డబ్బు గుంజిందో తెలుసా..?

Lady Khiladi : ఆమె చేతిలో మంత్రులు,ఎమ్మెల్యేలు,వీఐపీల న్యూడ్‌ వీడియోలు .. ఎంత డబ్బు గుంజిందో తెలుసా..?

ARCHANA NAG(FILE)

ARCHANA NAG(FILE)

Lady Khiladi: ఆమె ఓ ఖిలాడీ లేడీ. వల వేసిందంటే ఎంతటి వాళ్లైనా పడి తీరాల్సిందే. ఒక్కసారి ఆమెకు చిక్కిన తర్వాత బయటపడాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందులో బడా నేతలు, పేరు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ మాయలేడి వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు తీగ లాగితే ఆమె నేరచరిత్రకు సంబందించిన డొంక కదులుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

ఆమె ఓ ఖిలాడీ లేడీ. వల వేసిందంటే ఎంతటి వాళ్లైనా పడి తీరాల్సిందే. ఒక్కసారి ఆమెకు చిక్కిన తర్వాత బయటపడాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందులో బడా నేతలు, పేరు సెలబ్రిటీ(Celebrity)లు ఉన్నారు. ఈ మాయలేడి వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు తీగ లాగితే ఆమె నేరచరిత్రకు సంబందించిన డొంక కదులుతోంది. అంతే కాదు ఈమె గుప్పిట్లో చిక్కుకొని ఊపిరాడక కోట్లు నష్టపోయిన వాళ్లలో జాతీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం ఉండటంతో పోలీసులు(Police)ఆమె పుట్టుపూర్వోత్తరాలు మొత్తం లాగుతున్నారు. అయితే అందాలు పెట్టుబడిగా ..వాట్సాప్ ఛాటింగ్‌(WhatsApp chatting), ఫోన్‌కాల్స్‌(Phone calls)తో ఎరవేయడంతో పాటు భర్త సహకారంతోనే అర్చననాగ్ (Archanag)అనే ఓ సాధారణ యువతి అడ్డదారిలో సంపాధించిన డబ్బులు, నెలకోల్పిన కంపెనీలపై ఏకంగా ఆదాయ పన్నుశాఖ(Income Tax Department)అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

Mulayam Singh Yadav : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

నగ్న వీడియోలతో సీక్రెట్‌ ఆపరేషన్ ..

ఒడిషాకు చెందిన ఓ మాయలేడి వ్యవహారం ఇప్పుడు మూడు జాతీయ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకాలం ఖిలాడీ లేడి ఉచ్చులో పడి కోట్ల రూపాయలు పోగొట్టున్న వాళ్లంతా దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఉన్నట్లుగా తేలింది. ఒకరు..ఇద్దరూ కాదు ఏకంగా 65మందిని ఓ ఖతర్నాక్ మహిళ తన చెప్పు చేతల్లో పెట్టుకొని కోట్లు రాబట్టిన విషయం ఇప్పుడు ఒడిశా పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్చననాగ్ ఒడిషాలోని కలహండి జిల్లా కెసింగ అనే ప్రాంతానికి చెందిన మహిళ కేవలం తన అందాల్ని చూపించి వీఐపీలను తన వలలో పడేలా చేసుకుంది. ఏడేళ్ల క్రితం భువనేశ్వర్‌కి మకాం మార్చిన అర్చననాగ్ అక్కడే ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్‌ నెంబర్లు సేకరించింది. ఆ విధంగా వారికి ఫేస్‌బుక్, వాట్సాప్‌ చాటింగ్ ద్వారా టచ్‌లోకి వెళ్లి తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంది.

అందం, మాటలతో వల..

ఈవిధంగా భువనేశ్వర్‌కి చెందిన కిలాడీ లేడీ నేతలు, అధికారులకు ఫోన్‌ ద్వారా క్లోజ్‌ అయి ..ఇంటికి పిలిపించుకొని వారితో శారీరక సంబంధం కొనసాగించింది. ఇందులో అవతలి వ్యక్తులకు తెలియకుండా తనతో ఉన్న మగవాళ్ల పర్సనల్‌ వీడియోలు, అర్ధనగ్న దృశ్యాలు, బెడ్రూం సీన్స్‌ అన్నీ జాగ్రత్తగా భద్రపరుచుకొని ...వాళ్లను డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేసింది. మీ పర్సనల్‌ వీడియోలు తన దగ్గరున్నాయని డబ్బులు ఇవ్వకపోతే అన్నింటిని బయటపెడతానని బెదిరించడంతో ఒక్కొక్కరు లక్షల్లో సమర్పించుకున్నారు. ఈవిధంగా అర్చన నాగ్ అనే మాయలేడి ఉచ్చులో పడిన వాళ్లో బీజు జనతాదళ్, బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వీళ్లే కాదు పేరు మోసిన వ్యాపారవేత్తలు, పోలీస్ అధికారులను వదల్లేదట ఈ కిలాడీ లేడీ. ఇదంతా తన భర్త జోగ బందునాగ్ సహకారంతో చేయడం విశేషం.

మాయలేడి ఉచ్చులో పడ్డ వీఐపీలు..

భువనేశ్వర్‌ లేడీ వేసిన అందాల వలలో చిక్కుకున్న వాళ్ల దగ్గర నుంచి స్టేటస్‌ను బట్టి డబ్బులు వసూలు చేసింది. మంత్రి దగ్గరైతే 5కోట్లు, ఎమ్మెల్యే అయితే కోటి రూపాయల చొప్పున వసూలు చేసి సుమారు మూడు కంపెనీలను నెలకోల్పి ఓ చీకటి సామ్రాజ్యానికి అధినేత్రిగా చలామణి అవుతూ వస్తోంది అర్చననాగ్. తన స్వకార్యం పూర్తి చేసుకోవడానికి వీఐపీలకు వేరే అమ్మాయిలతో కూడా శృంగార అవసరాలు తీర్చినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఈ ఖిలాడీ లేడీ అడ్డగోలుగా అడ్డదారిలో సంపాధించిన డబ్బుతో ఓ పాత కార్ల షోరూం, ఆదిత్య ప్రెస్టీజ్ లిమిటెడ్‌ పేరుతో మరో కంపెనీని ఏర్పాటు చేసినట్లుగా ఎంక్వైరీలో తేలింది. ఇక భువనేశ్వర్‌లోని సత్య విహార్ వంటి లగ్జరీ ఏరియాలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తే దాన్నిసూర్యనారాయణ పాత్రా అనే ఎమ్మెల్యే ప్రారంభించడం విశేషం.

మత్తుమందు ఇచ్చి మహిళపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరిస్తూ.. ఆ తర్వాత..

బ్లాక్‌మెయిల్‌తో నేరసామ్రాజ్యం..

ఈ బ్లాక్‌మెయిల్ కేసులో పోలీసులు తీగ లాగితే ఎక్కడ తమ పేర్లు బయటపడతాయో అనే భయంతో అధికారులు,సెలవులు పెట్టుకొని ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారట. అయితే ఈఖిలాడీ లేడీ ఉచ్చులో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లతో పాటు ఆమె సంపాధించిన కోట్లాది రూపాయల ఆస్తులను బయటపెట్టాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శృతిపట్నాయక్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒక మహిళ ఈ స్థాయిలో అక్రమాలు, నేరాలకు పాల్పడటం, కోట్లాది రూపాయలు కూడా బెట్టడం చూసి అధికారులే నోరు వెళ్లబెడుతున్నారు. ఆమెకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారల సంస్థలను జప్తు చేసి వివరాలు రాబడుతున్నారు. ఈ లేడీ ఖిలాడీకి సహకారం అందించిన భర్త జోగ బందునాగ్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని దగ్గర ఇంకా ఎవరివైనా సీక్రెట్‌ వీడియోలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Crime news, Fraud women, International news, Odisha

ఉత్తమ కథలు