BHOPAL 20 YEAR OLD GIRL MOLESTED ON THE PRETEXT OF MARRIAGE CASE FILED PAH
Affair:పెళ్లికి ముందే సంబంధం పెట్టుకోవాలన్న యువకుడు... దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యువతి.. ఏంచేసిందో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
Madhya pradesh: భోపాల్లోని లో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్లికి ముందే శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఆమెపై తన కామ వాంఛను తీర్చుకున్నాడు.
Bhopal 20 year old girl molested in the name of marriage: మధ్యప్రదేశ్ భోపాల్ లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న సుభాష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 20 యేళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు శనివారం ఐష్బాగ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనపై అఘాయిత్యం చేసిన నిందితుడు తన తండ్రి దుకాణంలో పని చేసేవాడని... ఈ క్రమంలో తనతో పరిచయం పెంచుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.
తన తండ్రి దుకాణంలో పనిచేసే వ్యక్తితో సదరు యువతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది . అతను యువతికి మాయమాటలు చెప్పాడు. ఆమెను లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలోనే నిందితుడు 2021 డిసెంబర్లో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరుతూ తనకు ఫోన్ చేశాడని యువతి తెలిపింది. అయితే పెళ్లికి ముందు ఇలా చేయడం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పింది. దీంతో అతను ఆమె ఇంటికి చేరుకున్నాడు. మాట్లాడుకుందామని పిలిచాడు. ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకుని.. బలవంతంగా ఆమెను అత్యాచారం చేశాడు. ఆ తరువాత విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు దిగాడు.
కొన్ని రోజులకు.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తరువాత పెళ్లి విషయం మాట్లాడదామని చెప్పి బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా నిందితుడు మరోసారి ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వేధింపులకు యువతి కొంతకాలం మౌనంగా భరించింది. కానీ అతగాడి వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు ధైర్యం చేసి బాధితురాలు శనివారం ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.