వర్చువల్ కిడ్నాపింగ్... పిల్లలే టార్గెట్... పేరెంట్స్‌కి పోలీసుల సూచనలు...

కిడ్నాప్ అంటే మనకు తెలుసు. ఈ వర్చువల్ కిడ్నాప్ ఏంటి? ఇది ఎలా జరుగుతుంది? కచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు పోలీసులు.

news18-telugu
Updated: August 2, 2020, 1:09 PM IST
వర్చువల్ కిడ్నాపింగ్... పిల్లలే టార్గెట్... పేరెంట్స్‌కి పోలీసుల సూచనలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఆన్‌లైన్ క్లాసుల వంటివి జరుగుతున్నాయి కదా... అందువల్ల ఇంటర్నెట్ అనేది పిల్లలకు అలవాటు అవుతోంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకుంటూ హ్యాకర్లు వర్చువల్ కిడ్నాపింగ్ అనే విధానం అమల్లోకి తెచ్చారు. ఈ విధానంలో పిల్లలు నిజంగా కిడ్నాప్ అవ్వరు. కానీ... పిల్లల తల్లిదండ్రులు మాత్రం కిడ్నాప్ అయ్యారనే అనుకుంటారు. అలా తల్లిదండ్రులు నమ్మేలా... హ్యాకర్లు అతితెలివి ప్లాన్స్ వేస్తున్నారు. టెక్నాలజీని వాడి... తల్లిదండ్రులను సైకలాజికల్‌గా ఇబ్బంది పెడుతున్నారు. తద్వారా డబ్బు డిమాండ్ చేసి... బ్లాక్‌మెయిల్ చేసి... వర్చువల్ కిడ్నాపింగ్ సక్సెస్ అయ్యేలా యత్నిస్తున్నారు.


దేశంలో నేరాలు బాగా జరిగే ముంబైలోనే ఇలాంటి నేరం జరగబోతుంటే... ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలేంటి ఇది అని లోతుగా పరిశీలించారు. ఇందులో హ్యాకర్లు రెండు పనులు చేస్తున్నారు. ఇంట్లో పిల్లల ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా సంపాదిస్తున్నారు. ఆ తర్వాత పిల్లల వాయిస్‌ని రికార్డ్ చేస్తున్నారు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక... ఇళ్లలో ఒంటరిగా ఉంటున్న పిల్లలు ఏ వీడియో గేమో మొబైల్‌లో ఆడుకుంటుంటే... సరిగ్గా అప్పుడు హ్యాకర్ ఎంటరవుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతూ... వాళ్ల వాయిస్, ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్నాడు.

ఆ తర్వాత... ఆ పిల్లాడు లేదా పాప దగ్గరున్న ఫోన్ పనిచేయడం మానేస్తోంది. వెంటనే తలిదండ్రుల వాట్సాప్‌కి... పిల్లాడు లేదా పాప కిడ్నాప్ అయినట్లుగా కనిపించే మార్ఫింగ్ ఫొటోలను పంపుతున్నారు. ఆ ఫొటోలను చూడగానే... కాల్ చేస్తున్నా్రు. మీ పిల్లాణ్ని కిడ్నాప్ చేశాం... మా దగ్గరే ఉన్నాడు. ఏడుస్తున్నాడు. కావాలంటే వినండి అంటూ... చిన్నారి ఏ వాయిస్‌తో అంతకుముందు హ్యాకర్‌తో మాట్లాడాడో ఆ వాయిస్‌కి తగినట్లుగా మిమిక్రీ ఏడుపు వాయిస్ రికార్డ్ చేసింది... పేరెంట్స్‌కి వినిపిస్తున్నారు. అది విన్న పేరెంట్స్... ఆ వాయిస్ తమ పిల్లాడిదే అని కంగారు పడుతున్నారు.

తల్లిదండ్రులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే... పోలీసులకు చెబితే... పీక కోస్తామని బెదిరిస్తున్నారు. అప్పటికప్పుడు... మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు మొబైల్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చెయ్యమని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డబ్బు ఇస్తే... చిన్నారిని ఇంట్లో వదిలేస్తామనీ... లేదంటే చంపేస్తామని అంటున్నారు. ఇదీ వర్చువల్ కిడ్నాపింగ్ నడుస్తున్న తీరు.
పిల్లలు మొబైల్‌తో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. హ్యాకర్లతో, కొత్త వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వాళ్లు మాట్లాడుతున్నారేమో గమనిస్తూ ఉండాలి. లేదంటే... నిజంగానే కిడ్నాప్ జరిగిందేమో అని టెన్షన్‌తో చాలా సమస్యలు ఎదుర్కొంటారని పోలీసులు చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading