భార్యమీద కోపంతో... చిన్నారితో బలవంతంగా మద్యం తాగిస్తున్న రౌడీ తండ్రి

చిన్నారికి మద్యం తాగిస్తున్న తండ్రి

రౌడీషీటర్‌గా మారిన ఓ తండ్రి తన ఐదేళ్ల చిన్నారితో కూడా మద్యం తాగిస్తున్నాడు. అంతే కాదు ఆ దుశ్చర్యను అక్కడున్న తన స్నేహితులతో వీడియో కూడా తీయించుకున్నాడు.

 • Share this:
  కడపున పుట్టిన పిల్లల్ని కన్నవారు ఎంత గొప్పగా పెంచాలనుకుంటారు. తల్లిదండ్రులు వారే జీవితంగా అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. తల్లి ఆలనా పాలన చూస్తుంటే...తండ్రి మాత్రం లోకాన్ని, బయట ప్రపంచాన్ని బిడ్డకు తెలియజేస్తే... అభివృద్ధికి బాటలు వేస్తుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తాను చెడిపోవడమే కాకుండా తన ఐదేళ్ల చిన్నారిని కూడా చెడగొడుతున్నాడు. మద్యానికి బానిసై, రౌడీషీటర్‌గా మారిన ఓ తండ్రి తన ఐదేళ్ల చిన్నారితో కూడా మద్యం తాగిస్తున్నాడు. అంతే కాదు ఆ దుశ్చర్యను అక్కడున్న తన స్నేహితులతో వీడియో కూడా తీయించుకున్నాడు. అనంతరం అతి తన భార్యకు పంపి ఆమెను కూడా మానసికంగా వేధింపులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో చోటు చేసుకుంది. బెంగుళూరుకు చెందిన కుమరేష్ అనే రౌడీ షీటర్‌ను ఓ మహిళ వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్లకే అతడు రౌడీ తెలియడంతో అతడ్ని విడిచిపెట్టింది. ఈలోపే ఆమె గర్భవతి కావడంతో ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. భార్య అతడ్ని విడిచిపెట్టిపోయిందని కోపంతో రగిలిపోయిన కుమరేష్.. తన బిడ్డతో ఇలా బలవంతంగా మద్యం తాగించాడు. ఆ వీడియో రికార్డ్ చేసి భార్యకు పంపి మానసిక వేధింపులకు గురి చేశాడు.

  తన బిడ్డ తండ్రితో కలిసి మద్యం తాగుతున్న వీడియోను చూసి షాక్ తిన్న ఆ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త బలవంతంగా బిడ్డకు మద్యాన్ని తాగిస్తున్నాడని తెలిపింది. మహిళ, శిశు సంరక్షణ కేంద్రానికి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు
  తండ్రిని అరెస్ట్ చేశారు. పోలీసుల సాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మాగడి పోలీస్ స్టేషన్‌లో కుమరన్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే అనేక దోపిడీలు, హత్యాయత్నాలకు ప్రయత్నించిన కుమరేష్ కోసం పోలీసులు కూడా గత కొంతకాలంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఇటు భార్యను కూడా అతడు వేధింపులకు దిగినట్లు గుర్తించారు. స్క్రూడైవర్‌తో భార్యను చిత్రహింసల పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కిరాతక తండ్రి కటాకటాల పాలయ్యాడు. చిన్నారి క్షేమంగా తల్లి ఒడికి చేరుకున్నాడు.
  Published by:Sulthana Begum Shaik
  First published: