హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో.. సినిమా రేంజ్ లో మాస్టర్ ప్లాన్.. భర్తను, ప్రియుడు మరో ముగ్గురితో కలిసి..

వామ్మో.. సినిమా రేంజ్ లో మాస్టర్ ప్లాన్.. భర్తను, ప్రియుడు మరో ముగ్గురితో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: తమ సుఖానికి అడ్డం వస్తున్నాడని భర్తపై కోపం పెంచుకుంది. ఎలాగైన భర్త అడ్డం తొలగిపోతే ఇక తాము ఎంజాయ్ చేయోచ్చని భావించింది. దీని కోసం మాస్టర్ ప్లాన్ వేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

కొంత మంది మహిళలు ఆడతానానికే మాయని మచ్చగా మిగులుతున్నారు. పెళ్లయిన తర్వాత.. ఇంటి పక్కల వారితో, ఇంట్లోని వారితో, ఎదురింటి వారితో ఎఫైర్ లు (Affair)  పెట్టుకుంటున్నారు. వావి వరసలు మరిచిపోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. పెళ్లికి ముందు అడ్డమైన బాగోతాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు పెళ్లి తర్వాత కూడా అడ్డమైన వేషాలు వేస్తున్నారు. ఇలాంటి పనుల వలన సభ్యసమాజంలో తమ పరువును, తమవాళ్ల పరువును బజారున పడేస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలను హతమార్చడానికి సైతం వెనుకాడటం లేదు. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka) షాకింగ్ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన అనుపల్లవి, నవీన్ కుమార్ భార్యభర్తలు. వీరిద్దరు పీణ్య సమీపంలోని దొడ్డబిదరకల్లులో ఉంటున్నారు. అయితే, అనుపల్లవికి, అదే ప్రాంతంలో ఉండే హిమవంత్ కుమార్ కు మధ్య ఎఫైర్ ఏర్పడింది. దీంతో ఆమె భర్తకు తెలియకుండా ప్రియుడితో మజా చేసేది. భర్త అడ్డు తొలగించుకుంటూ, ప్రియుడితో ఉండోచ్చని, అనుపల్లవి ప్లాన్ వేసింది. దీని కోసం, హరీష్, నాగరాజు, ముగిలన్ అనే ముగ్గురుని పనిలో పెట్టుకుంది. వీరికి నవీన్ ను చంపాక.. 2 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు అడ్వాన్స్ గా 90 వేలను ఇచ్చారు. నవీన్ ను చంపాక.. మిగతా డబ్బులను ఇస్తామని అన్నారు. అయితే.. నవీన్ ను కారులో ఎక్కించుకుని, వీరు ముగ్గురు కిడ్నాప్ చేసి (Kidnap) తమిళనాడుకు తీసుకెళ్లారు.

ఇతడిని చంపడానికి ముగ్గురుకూడా భయపడ్డారు. వీరికి మనస్సు ఒప్పుకోలేదు. దీంతో నవీన్ ను చంపినట్లు (Murder plane)  నమ్మించాలను కున్నారు. దీనికోసం టమోటా కచప్ ను కొన్నారు. ఇతనిపొట్టమీద కచప్ వేశారు. కత్తితో చంపినట్లు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను హిమవంత్ కు వాట్సాప్ చేశారు. నిజంగానే.. వారు ముగ్గురు నవీన్ ను చంపినారేమోనని.. హిమవంత్ భయంతో వణికిపోయాడు. వెంటనే గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ఇక... నవీన్ కుమార్ సోదరి ఆగస్ట్ 2 నుంచి తన సోదరుడి కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నవీన్ స్వయంగా 6 వ తేదీనాడు వచ్చి.. జరిగిన ఉదంతాన్ని పోలీసులకు తెలిపాడు. అయితే, దీనిలో అనుపల్లవి, హిమవంత్ కుమార్ కాల్ డాటాను పోలీసులు పరిశీలించారు. ఈ నేరంలో.. అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ పాత్ర ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకొని, విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Brutally murder, Crime news, Karnataka

ఉత్తమ కథలు