Home /News /crime /

BENGALURU WOMAN THROWS HER 4 YEAR OLD FROM 4TH FLOOR GIRL DIES PAH

OMG: అమానుషం.. నాలుగేళ్ల చిన్నారిని 4 వ అంతస్థు నుంచి విసిరేసిన తల్లి.. ఎందుకంటే..

బాాలికను కింద పడేస్తున్న తల్లి

బాాలికను కింద పడేస్తున్న తల్లి

Karnataka: కన్న తల్లి కూతురు పాలిట కసాయిగా మారింది. నాలుగో అంతస్థుపై బయట బాల్కనీలో నిలబడింది. ఆ తర్వాత... అత్యంత కిరాతకంగా కూతురుని కిందకు విసిరేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India
మనలో చాలా మంది పిల్లల కోసం అనునిత్యం పరితపిస్తుంటారు. పెళ్లయ్యక.. అమ్మ, నాన్న.. అని పిలిపించుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. కొందరి శరీరంలో ఎవైన లోపాలు ఉంటే.. ఆస్పత్రుల చుట్టు తిరుగుతుంటారు. పిల్లలు పుట్టడానికి ఎంత ఖర్చైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరికొందరు జాతకంలో ఏదైన దోషాలు ఉన్నాయా.. అని గుళ్లు, గోపురాల చుట్టు తిరుగుతుంటారు. అనేక రకాల పూజలు చేస్తుంటారు. ఇంకొందరు.. పిల్లలు లేకపోతే.. అనాథశ్రమాల నుంచి పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటారు.

అదే విధంగా దగ్గరి బంధువుల పిల్లలను దత్తత తీసుకుని మరీ పెంచుకుంటారు. అయితే.. కొందరు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలపై పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  దారుణ ఘటన జరిగింది. బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఒక ఇంట్లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ నాలుగో అంతస్థులో బాల్కనీలో నిలబడీ తన కూతురుని కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి తలపగలి అక్కడే చనిపోయింది.  ఈ క్రమంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ప్రకారం.. నాలుగేళ్ల బాలికకు మాటలు రావని, వినబడదని అందుకే తల్లి ఇలా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా బాలిక తల్లి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, తల్లి డెంటల్ డాక్టర్. అయితే.. తల్లి మానసిక ప్రవర్తనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళ కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లి కింద విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్లిప్పింగ్స్ వైరల్ గా (viral news) మారాయి.

ఇదిలా ఉండగా సోదరుడి అంత్యక్రియలకు వచ్చిన వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది.

ఉత్తరప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన వెలుగులోనికి వచ్చింది. బలరాంపూర్ లోని భవానీపూర్ గ్రామంలో.. అరవింత్ మిశ్రా (38) అనే వ్యక్తి పాముకాటుతో మరణించాడు. గోవింద్ మిషారా (22), చంద్ర శేఖర్ పాండే (22) ఇద్దరు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు అంత్యక్రియలు పూర్తి చేసుకుని రాత్రి , ఇంట్లో అదే గ్రామంలో పడుకున్నారు. అప్పుడు పాము.. ఇద్దరిని కాటు వేసింది. దీంతో చంద్రశేఖర్ పాండే నిద్రలోనే విగత జీవిగా మారాడు. ఆ తర్వాత.. గోవింద్ మిషారాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి కండీషన్ సీరియస్ గా ఉంది.

ఈ క్రమంలో.. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియలకు వచ్చి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న .. వైద్య, పరిపాలన శాఖ ఉన్నతాధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. లోకల్ ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి వారికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శ్రీ శుక్లా స్థానిక అధికారులను కోరారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు