హోమ్ /వార్తలు /క్రైమ్ /

Women in coma: ఐదేళ్ల పాటు కోమాలో ఉన్న మహిళ.. ఆసుపత్రిలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లు వేశారో తెలిస్తే..

Women in coma: ఐదేళ్ల పాటు కోమాలో ఉన్న మహిళ.. ఆసుపత్రిలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లు వేశారో తెలిస్తే..

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పూనమ్

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పూనమ్

పూనమ్ కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు చెప్పారు. మూడు వారాలకు మించి ఆమె బతికే అవకాశాలు లేవని చెప్పారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లమని పదేపదే చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా ఆమె ఇనిషియల్ కోమా స్టేట్ నుంచి బయటకు వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

కోమాలో ఉన్న ఒక మహిళకు ఐదేళ్లు చికిత్స అందించినందుకు ఆరు కోట్ల రూపాయల బిల్లు వేశారు బెంగళూరు డాక్టర్లు. కడుపు నొప్పి సమస్యతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరిన ఆమె, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కోమాలోకి వెళ్లింది. దీంతో దాదాపు 1,920 రోజుల వరకు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది. జనవరి 29న కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. కేరళకు చెందిన 33ఏళ్ల పూనమ్‌ అనే మహిళ దీనగాధ ఇది. డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆమె బలైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిశ్చార్జి అయ్యేనాటికి మొత్తం బిల్లు రూ.6 కోట్లు దాటింది. 20 కంటే ఎక్కువమంది డాక్టర్లు చికిత్స అందించినట్లు హాస్పిటల్ యాజమన్యాం చెబుతోంది. మెడికల్ సమరీ 11 పేజీలు, నాలుగు పేజీల ట్రీట్‌మెంట్ బిల్స్, వాటికి జత చేసిన 63 పర్టిక్యులర్స్‌ చూసి పూనమ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.1.34 కోట్ల హాస్పిటల్ బిల్లు చెల్లించారు. రెజిష్ నాయర్ తన భార్యతో హాస్పిటల్‌లో ఉండేందుకు IMB, Microsoft వంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకున్నాడు. ప్రస్తుతం ఒక కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాడు.

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా?

పూనమ్ పరిస్థితికి హాస్పిటల్ డాక్టర్లే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఇలా కావడానికి కారణాలను భర్త రెజిష్ వివరించారు. ‘2015 అక్టోబర్ 3న పూనమ్ కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరింది. అప్పటికి నా భార్య ఆరోగ్యంగానే ఉంది. కానీ పరీక్షలు చేసిన డాక్టర్లు చిన్న సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ తరువాత పేగుల్లో లీకేజీ కారణంగా కడుపునొప్పి ఎక్కువైంది. క్రమంగా ఇతర అవయవాలు దెబ్బతిని మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యుర్‌కు దారితీసింది. కొన్ని రోజులకే కోమాలోకి వెళ్లింది’ అని చెబుతున్నారు.

సమస్య ఏంటి?

కడుపు నొప్పికి చికిత్స కోసం పూనమ్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లింది. ఆపరేషన్ తరువాత కూడా ఆమె బాగానే ఉంది. కానీ సర్జరీలో డాక్టర్లు చేసిన తప్పులవల్లే సమస్యలు వచ్చాయని రెజిష్ తెలిపారు. ఆపరేషన్‌లో నిర్లక్ష్యం వహించడంతో, ఆమె పేగుల్లో లీకేజీ ఎక్కువైంది. కొన్నాళ్ల తరువాత తమ తప్పును గుర్తించిన డాక్టర్లు, ఆమె బతకదని, పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పారు. అప్పుడే పూనమ్‌ను ఇంటికి తీసుకెళ్లమన్నారు.

కోలుకుంది కానీ..

పూనమ్ కోమాలోకి వెళ్లిందని 2015 అక్టోబర్లో డాక్టర్లు చెప్పారు. మూడు వారాలకు మించి ఆమె బతికే అవకాశాలు లేవని చెప్పారు. తమ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే సమయానికే ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని నఖిలీ రిపోర్టులు తయారు చేశారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లమని పదేపదే చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా పూనమ్ ఇనిషియల్ కోమా స్టేట్ నుంచి బయటకు వచ్చింది. 2016 జనవరి నాటికి ఆమె సాధారణ స్థితికి వచ్చింది. స్పృహలోకి రావడం, శ్వాస తీసుకోవడం వంటివి మామూలుగానే ఉండటంతో ఆమెకు వెంటిలేటర్‌ తీసివేస్తారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ మళ్లీ డాక్టర్లు నిర్లక్ష్యం వహించారు. ఆమెకు ఇచ్చే కొన్ని రకాల మందులు ఆపేయడంతో పరిస్థితి మళ్లీ దిగజారింది. ఆ తరువాత ఏమాత్రం కోలుకోలేకపోయిందని రెజిష్ చెప్పారు. ‘పూనమ్‌ను మామూలు మనిషిని చేయాలనే ఆలోచన ఇక్కడి డాక్టర్లలో కనిపించలేదు. ఆమెకు ఇచ్చే మందులు ఆపేశారు. ఐదేళ్ల క్రితమే చనిపోతుందని చెప్పారు. దీన్ని నిజం చేసేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు’ అని రెజిష్ చెబుతున్నారు.

తప్పు జరిగింది

ఈ కేసులో డాక్టర్లు, హాస్పిటల్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పొట్టపై గాయాలు కావడం వల్ల పేగుల్లో లీకేజీ ఏర్పడుతుంది. ఈ సమస్యకు చికిత్స చేస్తే, 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మూడు నెలల్లో కోలుకుంటారు. కానీ ఐదేళ్లుగా ట్రీట్మెంట్ ఇస్తున్నా పూనమ్‌కు నయం కాలేదంటే ఏదో తప్పు జరిగినట్లు తెలుస్తోందని సీనియర్ డాక్టర్లు చెప్పారు. కానీ హాస్పిటల్ మాత్రం తాము సరైన చికిత్స అందించామని చెబుతోంది. పేగుల్లో లీకేజీ, రక్తంలో బాక్టీరియా చేరడం, అవయవాలు పాడైపోవడం వల్ల పూనమ్ కోమాలోకి వెళ్లిందని మెడికల్ రిపోర్టులో ఉంది.

Published by:Hasaan Kandula
First published:

Tags: Best health benefits, Crime news, Health benifits, Health secrets, Health Tips

ఉత్తమ కథలు