'సెక్స్ కావాలి'... మహిళకు స్విగ్గీ డెలివరీ బాయ్ వేధింపులు

Swiggy | మొదట మెల్లిగా ఏదో అన్నాడు. ఆమెకు అర్థంకాక మళ్లీ చెప్పమని అడగడంతో సెక్స్ కావాలని అన్నాడు. దీంతో ఆమె షాకైంది. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని ఫేస్‌బుక్ పోస్టులో వివరించింది. స్విగ్గీ యాజమాన్యానికి కంప్లైంట్ చేసింది.

news18-telugu
Updated: April 1, 2019, 6:26 PM IST
'సెక్స్ కావాలి'... మహిళకు స్విగ్గీ డెలివరీ బాయ్ వేధింపులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ చిక్కుల్లో పడింది. బెంగళూరులో స్విగ్గీ డెలివరీ బాయ్ మహిళను వేధించిన బాగోతం బయటపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం సదరు డెలివరీ బాయ్ సెక్స్ కావాలంటూ మహిళను వేధించాడు. బెంగళూరుకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఆమెను లైంగికంగా వేధించాడు. మొదట మెల్లిగా ఏదో అన్నాడు. ఆమెకు అర్థంకాక మళ్లీ చెప్పమని అడగడంతో సెక్స్ కావాలని అన్నాడు. దీంతో ఆమె షాకైంది. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని ఫేస్‌బుక్ పోస్టులో వివరించింది. స్విగ్గీ యాజమాన్యానికి కంప్లైంట్ చేసింది.

డెలివరీ బాయ్ దగ్గర్నుంచి నా ఫుడ్ ప్యాకెట్ లాక్కున్నాను. అతని మొహమ్మీదే తలుపు వేశాను. ఎంతో అసహ్యం వేసింది. తినాలనిపించలేదు. అసలు ఆ ఫుడ్ ప్యాకెట్‌ను ముట్టుకోవాలని అనిపించలేదు.

ఫేస్‌బుక్‌లో బాధితురాలి ఆవేదన


అంతటితో ఆమె ఊరుకోలేదు. స్విగ్గీ కస్టమర్ కేర్‌కు కంప్లైంట్ చేసింది. స్పందించిన స్విగ్గీ సారీ చెబుతూ రిప్లై ఇచ్చింది. అంతేకాదు... నష్టపరిహారం కింద రూ.200 కూపన్ పంపింది. డెలివరీ బాయ్‌పై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పింది. ఇదొక్కటే కాదు... డెలివరీ బాయ్స్ తీరు వల్ల స్విగ్గీ చిక్కుల్లో పడటం మామూలైపోయింది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్... తేడాలేంటీ?

Redmi Note 6 Pro Offer: రూ.399 ఈఎంఐ, జియో నుంచి 6 టీబీ డేటా... రెడ్‌మీ నోట్ 6 ప్రో ఆఫర్

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading