• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • BENGALURU URBAN HUSBAND FORCES HIS WIFE FOR WIFE SWAPPING WITH HIS FRIENDS AND WOMAN FILES COMPLAINT SRD

Wife Swapping: నేను నా ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్ చేశాను..నువ్వు కూడా నా ఫ్రెండ్ తో గడుపు..భర్తతో భార్య..

నిందితుడు వసీం షరీఫ్

Wife Swapping: నీకు పెళ్లి కాక ముందు ఇలాంటి ఎఫైర్లు ఎన్ని ఉన్నాయో నాకేమీ తెలుసు. ఇప్పుడు పతివ్రత లా ప్రవర్తిస్తున్నావంటూ సూటి పోటి మాటలతో భార్యను హింసించేవాడు.ఆమెకు మాదక ద్రవ్యాలు ఎక్కించి ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి ఆనందించేవాడు.

  • Share this:
    సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ముఖ్యంగా భార్యభర్తల వంటి పవిత్ర సంబంధానికి అపకీర్తి తెచ్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు చేసే పనులు రోత పుట్టిస్తున్నాయ్. కామకోరికలు తీర్చుకునేందుకు కొందరు వ్యక్తులు తమ భార్యలను మార్చుకునే నీచ సంప్రదాయానికి తెరలేపారు. ఈ క్రమంలోనే భార్యకు ఇష్టం లేకపోయిన ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి ఆమెను రేప్‌ చేస్తుంటే, బయట నుంచి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు. లైంగిక వేధింపులు భరించలేని ఓ భార్య పోలీసులను ఆశ్రయించగా అసలు సంగతి బయటపడింది. ఈ ఘటన బెంగళూరులోని శివాజీ నగర్ లో జరిగింది. వివరాల్లోకెళితే.. వసీం షరీఫ్ అనే వ్యక్తికి 2018 లో వివాహం జరిగింది. వివాహం అయిన దగ్గర నుంచి భార్యకు తన వికృత చేష్టలు చూపసాగాడు ఈ కీచక భర్త. తన మిత్రులతో కలిసి భార్యల మార్పిడి చేసుకునేందుకు అలవాటు పాల్పడ్డాడు. తన కామకోరికలను తీర్చుకునేందుకు కట్టుకున్న భార్యను బలి చేశాడు. ఫ్రెండ్స్ వైఫ్ స్వాపింగ్‌ పేరుతో జరిగే ఈ కుసంప్రదాయంలో భార్యలను మార్చుకుంటారు. ఒకరి భార్యతో మరొకరు ఎంజాయ్ చేయడం ఈ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఇటీవలే ఓ బడా కార్గో కంపెనీ అధిపతి ఇలా భార్యలను మార్పిడి చేసుకునే గ్రూపులో చేరాడు. ముందుగా ఇతరుల భార్యలతో బాగానే ఎంజాయ్ చేశాడు. అయితే తన భార్యను కూడా వేరే ఫ్రెండ్ దగ్గరకు వెళ్లమని కోరాడు. అందుకు తన భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను చితకబాదాడు.

    నీకు పెళ్లి కాక ముందు ఇలాంటి ఎఫైర్లు ఎన్ని ఉన్నాయో నాకేమీ తెలుసు. ఇప్పుడు పతివ్రత లా ప్రవర్తిస్తున్నావంటూ సూటి పోటి మాటలతో భార్యను హింసించేవాడు.ఆమెకు మాదక ద్రవ్యాలు ఎక్కించి ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి వారి స్నేహితులకు లైంగిక సుఖాన్ని ఇవ్వాలని వేధింపులకు గురిచేశాడు. ప్రెండ్స్‌ అతని కళ్ల ముందే దారుణంగా రేప్ చేస్తుంటే.. వీడియో తీస్తూ పైశాచికానందం పొందేవాడు. అయితే ఈ నరకయాతనను మౌనంగా భరించిన ఆ భార్య.. తట్టుకోలేకపోయింది. ముందుగా భర్త అరచాకాల్ని తన అత్తగారికి తెలియజేసింది. అయితే, ఆమె మాటలు భారీ షాకిచ్చాయ్. భర్త మాట వింటే తప్పేముంది. ఇది బయట తెలిస్తే పరువు పోతుందని కబుర్లు చెప్పింది.

    ఇటీవల, గోవాకు వెళ్లినప్పుడు కూడా మద్యం తాగి.. తన ఫ్రెండ్ తో గడపాలని ఇబ్బంది పెట్టారు. తన భర్త ప్రవర్తనతో విసిగిచెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇష్టం లేకపోయినా ఫ్రెండ్ భార్యపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు సమాచారం.
    Published by:Sridhar Reddy
    First published: