దేశంలో లైంగికదాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గుడిలోకి వచ్చినవారికి దేవుడి ఆశీర్వాదాలు అందజేయాల్సిన ఒక పూజారి.. అడ్డదారులు తొక్కాడు. మనుమరాలు వయసున్న బాలికను రేప్ చేశాడు.
దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మగవారిలో పెరుగుతున్న నేర ప్రవృత్తి మహిళల పాలిట శాపమవుతున్నది. దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అమాయక బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. వరుసకు తండ్ర, సోదరుడు, మామ, తాత.. ఎవరైనా సరే.. ఆ విషపు కౌగిలిలో బాలికల జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. దేశంలో లైంగికదాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గుడిలోకి వచ్చినవారికి దేవుడి ఆశీర్వాదాలు అందజేయాల్సిన ఒక పూజారి.. అడ్డదారులు తొక్కాడు. మనుమరాలు వయసున్న బాలికను రేప్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
కర్నాటకలోని చిక్ బళ్లపూర్ కు చెందిన వెంకటరమణప్ప (68) పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని అల్లుడు కూడా బెంగళూరులో పూజారిగా పనిచేస్తున్నాడు. అతడికి వేరే పని ఉండి.. కొద్దిరోజుల పాటు గుడిలో పూజలు చేయడానికి మామయ్యకు కబురు పంపాడు. ఇందుకు అంగీకరించిన వెంకటరమణప్ప.. బెంగళూరు వచ్చి అల్లుడు చెప్పిన గుడిలో పూజాధికాలు చేయడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి ప్రాంగణంలో ఒక పదేళ్ల బాలిక.. తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. పూజారి కన్ను ఆ పసికందు మీద పడింది. ఆ బాలికను పిలిచాడు. ‘నూవ్ ఏం చదువుతున్నావ్.. ఎక్కడుంటావ్.. తల్లిదండ్రులు ఏం చేస్తారు..?’ వంటి ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత తనతో ఇంటికి వస్తే చాక్లెట్లు కొనిస్తా అని ఆశపెట్టాడు. సహజంగానే చిన్నారులు స్వీట్లంటే ఆశపడతారు. పూజారి తాత ఇంట్లో స్వీట్లు చేసిస్తాడేమో అనుకుని ఆ పాప అతడితో పాటే బయలుదేరింది. కానీ ఆ పసి మనసుకు తెలియదు తనను తీసుకెళ్తున్నది కామాంధుడని..
కూతురు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలికను అక్కడకు తీసుకెళ్లిన పూజారి... ఆ పసిపాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి ఎంత గింజుకున్నా వదలకుండా... ఆ పసి మనసుకు గాయాలు చేశాడు. వదిలేయమని ఆ పాప ప్రాధేయపడినా వినకుండా.. మృగంలా ఆ బాలిక మీద పడి రేప్ చేశాడు.
పొద్దుననగా ఆడుకోవడానికి వెళ్లిన బాలిక ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆలయ ప్రాంగాణంలో వెతకడం మొదలుపెట్టారు. దీంతో అక్కడే గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చూసి వారు షాక్ కు గురయ్యారు. ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడగగా.. ఆమె జరిగిన విషయం వారితో చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. నిందితుడిని అరెస్టు చేశారు.