పెళ్లికొడుక్కి గద్ద ముక్కు... పెళ్లిక్యాన్సిల్ చేసిన యువతి.. అతడేం చేశాడంటే...

ప్రతీకాత్మక చిత్రం

రష్మీ, ఆమె కుటుంబం తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని భావించిన రమేష్ గతంలో కూడా వారు ఇలాగే చాలా మందిని చీటింగ్ చేసి ఉంటారని అనుమానించాడు.

 • Share this:
  బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తనకు ఓ యువతి మోసం చేసిందని, పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాత చివరకు తనకు పెద్ద ముక్కు ఉందంటూ ఇప్పుడ పెళ్లి రద్దు చేసిందని కోర్టుకు ఎక్కాడు. ఆమె మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరాడు.

  బెంగళూరుకు చెందిన రమేష్ (పేరు మార్చాం) వయసు 35 సంవత్సరాలు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా అమెరికాలో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రష్మి (పేరు మార్చాం)తో పరిచయం ఏర్పడింది. ఆగస్ట్‌లో వారి మధ్య ఫోన్ కాల్స్ ప్రారంభం అయ్యాయి. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆగస్ట్ 13న ఆమె అమెరికా నుంచి బెంగళూరు వచ్చింది. ఇద్దరూ కలసి ఓ స్టార్ హోటల్‌లో కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం రష్మి చెప్పడంతో ఆమె సోదరి లక్ష్మిని కలవాలని చెప్పడంతో ఆమె నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నాడు. అనంతరం ఆగస్ట్ 26న రమేష్ తల్లిదండ్రులు బెంగళూరులోని రష్మి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. సెప్టెంబర్ 9న రమేష్, రష్మి నిశ్చితార్థం జరిగింది.

  2020 జనవరి 30న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే, తిరుపతిలోనే పెళ్లి జరగాలని రష్మి కుటుంబం కండిషన్ పెట్టింది. అయితే, తమకు ఎక్కువ మంది బంధువులు బెంగళూరులోనే ఉన్నారని, వేదికను నగరంలోనే ఏర్పాటు చేయాలని కోరినా అందుకు వారు నో చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తిరుపతిలోనే పెళ్లికి రమేష్ కుటుంబం అంగీకరించింది.

  తిరుపతిలో పెళ్లి కోసం రమేష్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. బంధువుల కోసం 70 రూమ్‌లు బుక్ చేశాడు. అందుకు రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించాడు. దీంతోపాటు బట్టలు, గిఫ్ట్‌ల కోసం మరో రూ.4లక్షలు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో రష్మి మళ్లీ జాబ్ మీద అమెరికా వెళ్లిపోయింది.

  అక్టోబర్‌లో ఓ రోజు రష్మీ... రమేష్ తండ్రికి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో రమేష్ షాక్‌కి గురయ్యాడు. అక్టోబర్ 23న రష్మీకి ఫోన్ చేశాడు. ఆరోజు ఫోన్ లిఫ్ట్ చేసిన రష్మీ.. రమేష్‌కు గద్దముక్కు ఉందని అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు వెటకారంగా చెప్పింది. ఈ విషయంపై మరోసారి ఫోన్ చేసినా కూడా ఆమె నుంచి అదే సమాధానం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రమేష్ ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేసింది. ఆమె కుటుంబసభ్యులు కూడా రమేష్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.

  రష్మీ, ఆమె కుటుంబం తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని భావించిన రమేష్ గతంలో కూడా వారు ఇలాగే చాలా మందిని చీటింగ్ చేసి ఉంటారని అనుమానించాడు. ఆ మేరకు కోర్టులో ప్రైవేట్ కంప్లెయింట్ ఇచ్చాడు. దీంతో కోర్టు నిందతురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: