• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • BENGALURU POLICE ARE ON THE LOOKOUT FOR A MAN IN HIS LATE FORTIES FOR SEXUALLY HARASSING A YOUNG WOMAN AND HER MOTHER SSR

Bengaluru: నలభై ఏళ్ల వయసులో ఇవేం పనులు అంకుల్.. 23 ఏళ్ల యువతి తల్లి బట్టలు మార్చుకుంటుండగా..

ప్రతీకాత్మక చిత్రం

యువతి తల్లిపై కన్నేసిన భీమన్న ఆ యువతి ఇంట్లో లేని సందర్భంలో, ఆమె తల్లి ఒంటరిగా ఉన్న సందర్భంలో కనిపించకుండా నక్కి ఇంటి కిటికీల్లో నుంచి ఆమెను చూసేవాడు. అంతేకాదు.. తనతో ఒకసారి గడపాలని యువతి తల్లిని...

  • Share this:
    బెంగళూరు: ఒంటరి మహిళలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు సమాజంలో కనిపించడం లేదు. ఓ 23 ఏళ్ల యువతి, ఆమె తల్లి ఇంట్లో ఉండగా వారిని ఓ నడి వయసున్న వ్యక్తి మానసికంగా వేధించసాగాడు. తొలుత.. మంచివాడిగా నటించి వారితో పరిచయం పెంచుకున్న ఆ కామాంధుడు ఆ తర్వాత తన అసలు బుద్ధి బయటపెట్టాడు. తనకు ఇద్దరిలో ఎవరైనా పడక సుఖం పంచాలని వారిని వేధించసాగాడు. నార్త్ బెంగళూరులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న తల్లికుమార్తెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ బెంగళూరుకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో ఆమె తల్లి, ఆమె ఇద్దరూ ఉంటున్నారు. ఈ క్రమంలో.. భీమన్న అనే 40 ఏళ్ల వ్యక్తి ఈ కుటుంబంతో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించాడు. మంచివాడిలా నటిస్తూ యువతి తల్లితో మాటలు కలిపేందుకు చూశాడు. ఒకరోజు యువతి, ఆమె తల్లి ఇంట్లో ఉండగానే ఇంటికెళ్లి ఏ అవసరం ఉన్నా తనతో చెప్పాలంటూ వారికి చెప్పాడు. తనతో మాట్లాడాలని యువతి తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే.. అందుకు ఆమె నిరాకరించి.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని తెగేసి చెప్పింది. అయినా ఆ ప్రబుద్ధుడి తీరు మారలేదు. ఏం పర్వాలేదని.. వీలు చూసుకుని తన ఇంటికి రావాలని యువతి తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. అంతటితో ఆ కామాంధుడి అకృత్యాలు ఆగలేదు. యువతి తల్లిపై కన్నేసిన భీమన్న ఆ యువతి ఇంట్లో లేని సందర్భంలో, ఆమె తల్లి ఒంటరిగా ఉన్న సందర్భంలో కనిపించకుండా నక్కి ఇంటి కిటికీల్లో నుంచి ఆమెను చూసేవాడు. అంతేకాదు.. తనతో ఒకసారి గడపాలని యువతి తల్లిని ఒత్తిడి చేసేవాడు. అందుకు డబ్బు కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు. అందుకు నిరాకరించిన యువతి తల్లి.. మరొక్క మారు ఇలా తనతో ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయితే.. అప్పటి నుంచి ఆమెను నేరుగా కలవకుండా కిటికీల్లో నుంచి ఆమెను చూసేవాడు. ఒకరోజు యువతి తల్లి బెడ్రూంలో దుస్తులు మార్చుకుంటుండగా కిటికీలో నుంచి చూస్తూ భీమన్న ఆమె కంటపడ్డాడు. దీంతో.. ఒక్కసారిగా షాకయిన యువతి తల్లి భయంతో కేకలేసింది. అక్కడ నుంచి భీమన్న పారిపోయాడు.

    ఏప్రిల్ 14న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యువతి తల్లి ఇంట్లో లేని సమయంలో.. యువతి ఇంట్లో ఉండగా భీమన్న ఇంటికి వెళ్లాడు. తన శారీరక అవసరం తీర్చాలని.. అందుకు మీ అమ్మ ఒప్పుకోవడం లేదని.. పోనీ నువ్వైనా అర్థం చేసుకుని తన కోరిక తీర్చాలని ఆ యువతిపై చేతులేసి మాట్లాడాడు. ఈ పరిణామంతో షాకయిన యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని భీమన్నను హెచ్చరించింది. ఈ సందర్భంలో ఆమెపై భీమన్న అత్యాచారానికి యత్నించాడు. ఆమె బట్టలు చించి.. బలాత్కారానికి యత్నించాడు.

    అయితే.. ఆమె అలారం మోగించడంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. అక్కడ నుంచి వెళుతూ జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ యువతిని హెచ్చరించాడు. భీమన్న వేధింపులకు విసిగిపోయిన ఆ యువతి, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 354-ఏ కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. భీమన్న ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
    Published by:Sambasiva Reddy
    First published: