ఎదురింటి అంటీకి అంకుల్ లైంగిక వేధింపులు.. ఆమె భర్త ముందే అసభ్య ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఎదురింట్లో ఉంటున్న వివాహితపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడటమే కాకుండా, ఆమె భర్త ముందే నీచంగా ప్రవర్తించాడు.

 • Share this:
  ఎదురింట్లో ఉంటున్న వివాహితపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడటమే కాకుండా, ఆమె భర్త ముందే నీచంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడిని ముద్దినపాల్యలోని విశ్వేశ్వరయ్య లే అవుట్ 7వ బ్లాక్‌లో నివాసం ఉంటున్న 48 ఏళ్ల ఉత్తమ్‌గా గుర్తించారు. ఉత్తమ్ ఆ ప్రాంతంలో గత ఎనిమిది నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇక, ఉత్తమ్‌ను అతని భార్య వదిలిపెట్టి వెళ్లింది. పిల్లలను కూడా ఆమెతో పాటే తీసుకెళ్లింది. వివరాలు.. 38 ఏళ్ల బాధితురాలు లక్ష్మి(పేరు మార్చడం జరిగింది) ముద్దినపాల్య ప్రాంతంలో గత రెండేళ్లుగా నివాసం ఉంటుంది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 15 సంవత్సరాలు, మరొకరిది 12 ఏళ్లు. అయితే నిందితుడు ఉత్తమ్ వారి ఇంటికి ఎదురింట్లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మి ఏదైనా పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు.. నిందితుడు వేధింపులకు గురిచేసేవాడు.

  ఇక, గురువారం సాయంత్రం లక్ష్మి.. తన కుక్కను బయటకు వాక్‌కు తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆమె భర్త, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తిరిగి ఇంటికి చేరేసరికి.. ఉత్తమ్ గేటు వద్ద నిల్చుని ఉన్నాడు. దీంతో అక్కడ ఎందుకు ఉన్నావని అతడిని లక్ష్మి ప్రశ్నించింది. దీంతో ఉత్తమ్.. డిన్నర్‌కు కర్రీ కోసం వచ్చినట్టుగా సాకు చూపెట్టాడు. అయితే అతన్ని పట్టించుకోని లక్ష్మి ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది.

  అదే సమయంలో బయటకు వచ్చిన లక్ష్మి భర్త.. ఉత్తమ్‌ను ప్రశ్నించాడు. ఆ సమయంలో లక్ష్మిని నిజంగా ఇష్టపడ్డాడని ఉత్తమ్.. ఆమె భర్తకు చెప్పాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఉత్తమ్.. లక్ష్మి భర్త ముందే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమె బట్టలు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తర్వాత బాధితురాలి.. ఉత్తమ్‌పై అన్నపురేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

  ‘ఉత్తమ్ ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఒంటిపై సరైన దుస్తులు లేకుండా కనిపించేవాడు. అతని ఇంటి తలుపులు, కిటీకిలు తెరిచి ఉంచి.. కేవలం లోదుస్తులు ధరించి తమకు కనిపించేలా తిరిగేవాడు. అలాగే ఫోన్‌లలో చాలా గట్టిగా మాట్లాడేవాడు. అందులో చాలా అసభ్య పదజాలం ఉపయోగించేవాడు. అయితే అతడు కొద్ది రోజులకైనా వేధింపులను ఆపివేస్తాడనే ఆశతో.. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పలేదు. కానీ అతని వేధింపులు ఆగలేదు. అతని ప్రవర్తన మరింతగా దిగజారింది’అని లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మరుసటి రోజు నిందితుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: