సినిమాల్లో ఛాన్స్‌ల పేరుతో.. హోటల్‌కు తీసుకెళ్లి కోర్కెలు తీర్చుకుని..

ప్రతీకాత్మక చిత్రం

జహంగీర్ గతేడాది చెన్నైలో ఉద్యోగం మానేసి.. అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు నిర్దారించారు. చెన్నై,బెంగళూరులకు చెందిన పలువురు యువతులను మోసగించినట్టు గుర్తించారు.

 • Share this:
  సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి యువతులతో శారీరక వాంఛలు తీర్చుకుంటున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రకరకాల పేర్లతో అతను పలువురు యువతులను మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాని లీలలు బయటపడ్డాయి.

  పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన జహంగీర్(30) ఎంబీఏ చేశాడు. అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో లైంగిక కోర్కెలు తీర్చుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇటీవల 28ఏళ్ల ఓ యువతి ఇతనికి పరిచయమైంది.తాను బిజినెస్‌మాన్ అని,తన తండ్రి తమిళనాడులో ఎమ్మెల్యే అని పరిచయం చేసుకున్నాడు. తన తల్లి డాక్టర్‌గా పనిచేస్తోందని చెప్పాడు. బెంగళూరులోని ఎంజీ రోడ్‌లో తమ కుటుంబానికి ఒక మాల్ కూడా ఉందని చెప్పాడు. ఇవన్నీ నిజమేనని ఆ యువతి నమ్మేసింది.

  అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని జహంగీర్ ఆశ పెట్టాడు.ఇదే క్రమంలో ఓరోజు కోరమంగళలోని ఓ హోటల్‌కు ఆమెను పిలిచాడు. అక్కడ ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచి అతన్ని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

  జహంగీర్ గతేడాది చెన్నైలో ఉద్యోగం మానేసి.. అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని పోలీసులు నిర్దారించారు. చెన్నై,బెంగళూరులకు చెందిన పలువురు యువతులను మోసగించినట్టు గుర్తించారు. బిజినెస్‌మాన్‌గా పరిచయం చేసుకుని.. సినిమాల్లో ఛాన్స్‌లు,మోడలింగ్ పేరుతో చాలామందిని ట్రాప్ చేసినట్టు గుర్తించారు. లాంగ్ డ్రైవ్స్‌కి తీసుకెళ్లి..అక్కడ వారితోనే ఖర్చు చేయించేవాడని.. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి మోసం చేసేవాడని దర్యాప్తులో తేల్చారు.
  Published by:Srinivas Mittapalli
  First published: