Home /News /crime /

BENGALURU MAN KILLS WIFE OF 15 YEARS AFTER SUSPECTING SHE ACTED IN INDECENCY MOVIE PAH

Shocking: నీలి చిత్రాలు చూసి.. కట్టుకున్న భార్యను హత్య చేశాడు.. కారణం ఏంటంటే..

జాహీర్ పాషా (ఫైల్)

జాహీర్ పాషా (ఫైల్)

Karnatana: బెంగళూరులో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. తన భార్య.. పోర్న్ వీడియోలో నటించిందని అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు.

Man kills wife  suspecting she acted in indecency movie: ప్రస్తుతం సమాజంలో కొందరు పవిత్రమైన వివాహా బంధాన్ని అపహస్యం చేస్తున్నారు. కొందరు వివాహేతర సంబంధాలతో తమ జీవితాన్ని బజారు పాలు చేసుకుంటున్నారు. మరికొందరు అనుమానం, కట్నకానుకలు అంటూ పెళ్లి చేసుకున్న వారిని నానా హింసలకు గురిచేస్తున్నారు. ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను కడతేర్చాడు. ఈ సంఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బెంగళూరు కు చెందిన జాహీర్ పాషా, ముబీనాకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరు బెంగళూరులోని రాంనగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో జాహీర్ ఆటోనడుతుపు తనకుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, జాహీర్ కు పోర్న్ వీడియోలు చూసే పాడు అలవాటు ఉంది. దానికి ఇతను బానిసలా మారిపోయాడు. ఈ క్రమంలో.. అతను ఈ మధ్య చూసిన ఒక వీడియోలో మహిళ తన భార్యలాగా ఉండటాన్ని గమనించాడు.

అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ముబీనాను వేధించేవాడు. ఎన్నిసార్లు నచ్చ చెప్పినా.. అతను మారలేదు. తరచుగా భార్యపై చేయిచేసుకునే వాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఆమెను కొట్టగా, ఆస్పత్రి పాలైంది. ఇక విసిగిపోయిన మహిళ తండ్రి గౌస్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా ముబీనా వద్దని వారించింది. ఈ క్రమంలో గత ఆదివారం జాహీర్ పాషా ఇంటికి చేరుకున్నాడు.

తన భార్యను ఎలాగైన అంతం చేయాలనుకున్నాడు. భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన.. జాహీర్ పాషా గత ఆదివారం అర్థరాత్రి 12.40 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పడు భార్య, పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో.. జాహీర్ పాషా తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. మహిళ అరుపులకు పిల్లలు నిద్ర నుంచి మేల్కొన్నారు. వెంటనే భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత.. అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన దారుణాన్ని.. జాహీర్ పాషా పిల్లలు విషయాన్ని ముబీనా తండ్రి గౌస్ పాషాకు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Brutally murder, Crime news, Karnataka, Women harrasment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు