రూ.200 పందెం... ఆడింది మొబైల్ లూడో గేమ్... ఫలితం ఓ హత్య...

Ludo Game Murder : గేమ్ అనేది ఆహ్లాదాన్ని పంచేందుకు ఆడుకోవాలిగానీ... ఇలా ప్రాణాలు తీసుకుంటే ఎలా... అసలేం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 11:19 AM IST
రూ.200 పందెం... ఆడింది మొబైల్ లూడో గేమ్... ఫలితం ఓ హత్య...
ల్యూడో గేమ్ (File)
  • Share this:
బెంగాల్ ‌నుంచీ తన భార్య, ఇద్దరు పిల్లలతో వచ్చి... బెంగళూరులోని బెంద్రె నగర్‌లో నివసిస్తున్నాడు 32 ఏళ్ల మహ్మద్ అలీ షాహిబ్. స్థానిక స్నేహితుడు షేక్ మిలాన్‌ను రాత్రి 10 గంటలకు కలిశాడు. ఇద్దరూ అలా నడుస్తూ... ఇల్యాస్ నగర్‌ వెళ్లారు. మొబైల్‌లో లూడో గేమ్ అడదామా అన్నాడు మిలాన్. సరే... ఎంత బెట్ అని అడిగాడు అలీ. రూ.200 అన్నాడు మిలాన్. డీల్ కుదిరింది. ఆట మొదలైంది. కొంతసేపు ఆడాక ఆట మంచి రసపట్టులో ఉంది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఇద్దరికీ టెన్షన్ ఉంది. సరిగ్గా అప్పుడే... ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. గట్టిగా అరుస్తూ అక్కడికి దగ్గర్లోని తన నలుగురు ఫ్రెండ్స్‌నీ పిలిచాడు మిలాన్. పరిగెత్తుకొచ్చినవాళ్లు... అలీని రౌండప్ చేశారు. ఆ తర్వాత... మిలాన్... కత్తి బయటకు తీశాడు. పక్కనే ఉన్న కారుపై అలీని పడుకోబెట్టి... కత్తితో చెవి వెనక భాగంలో కసక్కున పొడిచాడు. రక్తం ప్రవాహమైంది. మిలాన్ సహా ఐదుగురూ పారిపోయారు.

మృత్యువుతో పోరాడుతున్న అలీని... స్థానికులు... దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతను బతకడం కష్టమన్న డాక్టర్లు... పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. స్థానికులు అతన్ని జయనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే... మధ్యలోనే మృత్యువుకి తలవంచాడు అలీ.

ఐదుగురు కలిసి హత్యలో పాల్గొనడంతో ఈ కేసును పోలీసులు ఈజీగా టేకప్ చేశారు. హంతకులందర్నీ పట్టుకున్నారు. ఇంతకీ గొడవ ఎందుకు జరిగిందని ఎస్సై అడిగితే... అసలు విషయం చెప్పాడు మిలాన్. ఆ రాత్రి ఇద్దరూ లూడో గేమ్ ఆడుతుంటే... మిలాన్ డైస్ వెయ్యాల్సి ఉంది. అతను డైస్ వెయ్యకముందే... అలీ డైస్ వేసేశాడు. అక్కడ గొడవ మొదలైంది. నేను వెయ్యాల్సిన డైస్ నువ్వెందుకు వేశావని మిలాన్ ప్రశ్నించాడు. నువ్వు వేసేశావేమో అని నేను వేశాను అన్నాడు అలీ. అబద్ధం... నేను గెలవకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు వేసేశావు అని రివర్స్ అయ్యాడు మిలాన్. అలా గొడవ పెద్దదైంది. చివరకు అలీ ప్రాణాలు పోయాయి.

 ఇవి కూడా చదవండి :

షోరూంకి వెళ్లాడు... కారు ఎత్తుకుపోయాడు... రూ.18.6 లక్షలు హాంఫట్...

రాళ్ల లాంటి గుడ్లు... ఇటుక లాంటి జ్యూస్... సియాచిన్‌లో ఇండియన్ ఆర్మీ సెన్సేషనల్ వీడియో

చికెన్ ధరల మోత... భారీగా పెంపు... మాంస ప్రియులకు నిరాశ...


షుగర్ ఫ్రీ మామిడి పండ్లు... డయాబెటిక్ పేషెంట్లకు పండగే...

రోజా, అంబటికి నామినేటెడ్ పదవులు... సీఎం జగన్ ఆలోచన ఇదేనా?
First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు