షోరూంకి వెళ్లాడు... కారు ఎత్తుకుపోయాడు... రూ.18.6 లక్షలు హాంఫట్...

Nissan Kicks Car : జస్ట్ రూ.2 లక్షలు చెల్లించి, కారు ఎత్తుకు పోవడం సాధ్యమేనా? అతను చేసిన నిర్వాకమేంటి? షోరూం ఉద్యోగులు ఎలా మోసపోయారు?

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 10:29 AM IST
షోరూంకి వెళ్లాడు... కారు ఎత్తుకుపోయాడు... రూ.18.6 లక్షలు హాంఫట్...
నిస్సాన్ కిక్స్ కారు (File)
  • Share this:
బెంగళూరులోని నిస్సాన్ షోరూంకి వచ్చాడు కస్టమర్ జోస్ థామస్. తనకు నిస్సాన్ కిక్స్ SUV వెహికిల్ కావాలని అన్నాడు. డౌన్ పేమెంట్‌ కింద అప్పటికప్పుడు రూ.2 లక్షలు చెల్లించాడు. ఇంకా రూ.16 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. డౌన్ పేమెంట్ కొంత ఇచ్చాను కాబట్టి... ఓసారి కారును తీసుకెళ్లి పూజ చేయించుకొని వస్తాను అన్నాడు. సరేలే అని ఒప్పుకున్నారు. అలా కారును పట్టుకెళ్లిన జోస్ థామస్ మళ్లీ తిరిగి రాలేదు. జనవరిలో జరిగిందీ చోరీ. నాలుగు నెలల తర్వాత మేలో కంప్లైంట్ ఇచ్చారు షోరూం మేనేజర్. జనవరి 23న దొద్దనెకుండిలోని సూర్యా నిస్సాన్ షోరూంలో జరిగిందీ ఘటన. సాయంత్రం వేళ అమాయకుడిలా వచ్చి... తమను మోసం చేశాడని మేనేజర్ గణేశ్ కుమార్ పోలీసులకు చెప్పి ఆవేదన చెందారు.

రూ.18.6 లక్షల కారును పట్టుకుపోయిన జోస్ మొబైల్‌కి కాల్ చెయ్యగా... స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అతను పనిచేస్తున్నానని చెప్పిన ఆఫీస్‌కి వెళ్లి అడిగితే... అలాంటి పేరుతో అక్కడ ఎవరూ లేరన్నారు ఇతర ఉద్యోగులు. ఐతే... 4 నెలల తర్వాత కంప్లైంట్ ఎందుకిచ్చారన్నదానిపై మాత్రం... గణేశ్ కుమార్ నోరు విప్పలేదు.

ఎత్తుకుపోయిన కారుకి టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఉంటే, బాగుండేదంటున్న పోలీసులు... ఇప్పుడు కారు, కారులా ఉందో లేదో కూడా కనుక్కోవడం కష్టమంటున్నారు. నిజమే మరి... ఆ మధ్య తెలంగాణలో ఓ బస్సును ఎత్తుకుపోయి... ఒక్క రోజులోనే పార్టులుగా విడగొట్టెయ్యలా.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు