కొడుకు వయస్సున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను..

భార్య గర్భిణీ కావడంతో డెలివరీ కోసం జనవరిలో పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమె భర్త ఒంటరిగా ఉంటూ వండుకుని తింటున్నాడు. అయితే అతడికి వంటలు సరిగా చేయరాకపోవడాన్ని గమనించిన వృద్ధ మహిళ అతడికి వంట, ఇంటి పనిలో సాయపడేది.

news18-telugu
Updated: July 11, 2020, 10:13 AM IST
కొడుకు వయస్సున్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వృద్ధుడు తన ఇంటిలో అద్దెకు దిగిన వేరే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానంతోనే రోజూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్యతో ఈ విషయమై గొడవపడి.. ఆరు పదుల వయస్సు దాటిన భార్య చేయ్యి విరగొట్టాడు. అయితే ఆ వృద్ధుడు అనుమానిస్తున్న వ్యక్తికి ఆమె కొడుకు వయస్సు ఉండడం గమనార్హం. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి(78) సెక్రటేరియట్‌లో మాజీ ఉద్యోగి. తన భార్య(68)తో కలిసి నివసిస్తున్నాడు. ఇంటిలో ఇద్దరు మాత్రమే ఉండడం.. పెద్ద ఇల్లు కావడంతో మరో వ్యక్తి(44)కి అద్దెకు ఇచ్చారు. ఆ వ్యక్తి తన భార్య(34)తో కలిసి ఆ ఇంటిలోనే అద్దెకు ఉంటున్నారు.

అయితే ఆ వ్యక్తి భార్య గర్భిణీ కావడంతో డెలివరీ కోసం జనవరిలో పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమె భర్త ఒంటరిగా ఉంటూ వండుకుని తింటున్నాడు. అయితే అతడికి వంటలు సరిగా చేయరాకపోవడాన్ని గమనించిన వృద్ధ మహిళ అతడికి వంట, ఇంటి పనిలో సాయపడేది. ఈ క్రమంలో 78 ఏళ్ల వ్యక్తి వృద్ధ మహిళ అయిన భార్య ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానంతోనే రోజూ భార్యతో గొడవపడేవాడు. అయినా ఆ వృద్ధ మహిళ ఆ యువకుడికి పనుల్లో సాయపడుతూనే వచ్చింది. ఆగ్రహించిన వృద్ధుడు ఒక రోజు భార్యతో గొడవపడి వృద్ధురాలు అని చూడకుండా ఆమె చెయ్యి విరగొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచాడు.

దీంతో ఆ వృద్ధ మహిళ పరిహార్ హెల్ప్ ‌డెస్క్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న హెల్ప్ డెస్క్ ప్రతినిధులు వృద్ధ మహిళతో మాట్లాడగా, ఆ యువకుడికి తన కొడుకులా భావించి సాయం చేశానని, అతడు నా వయస్సులో సగం ఉంటాడని, అయినా వినకుండా భర్త తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పరిహార్ హెల్ప్ డెస్క్ ప్రతినిధులు వృద్ధుడిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. ఏదిఏమైనా వృద్ధమహిళ భర్తతో కలిసి జీవించడం కొనసాగిస్తుంది. పరిహార్ సిబ్బంది ఆమె శ్రేయస్సు గురించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading