Shocking: ఏ తండ్రి చేయకూడని పని చేశాడు.. ప్రేయసి ముందే ఘోరం.. భార్యకు ఆ విషయం తెలిసినా..

ప్రతీకాత్మక చిత్రం

సునీల్ కుమార్(30) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సింధు(26) ఓ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో చెందిన నదియా కూడా పనిచేస్తుంది.

  • Share this:
    ఓ 10 ఏళ్ల పిల్లాడు కనిపించకుడా పోయి ఆరు నెలలు గడిచింది. అయితే తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చివరకు బంధువుల ఒత్తిడితో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. దిమ్మతిరిగే నిజాలను వెలికితీశారు. బాలుడి తల్లిదండ్రులతో పాటుగా తండ్రి ప్రేయసిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సునీల్ కుమార్(30) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సింధు(26) ఓ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో చన్నపట్నాకు చెందిన నదియా కూడా పనిచేస్తుంది. అయితే నదియాతో సునీల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరిద్దరి బంధాన్ని సింధు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. అయితే ఫిబ్రవరి 7వ తేదీన తన కొడుకు మాట్లాడిన మాటలు సునీల్‌కు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేశానికి లోనైన సునీల్ కొడుకును హత్య చేశాడు. ఆ సమయంలో నదియా అక్కడే ఉంది. సొంత కొడుకునే సునీల్ హత్య చేసిన దృశ్యాన్ని నదియ చూసింది. అయితే ఆ తర్వాత సింధు ఇంటికి తిరిగివచ్చాక.. సునీల్, నదియా ఇద్దరు జరిగిన విషయం ఆమెకు చెప్పారు.

    ఆ తర్వాత ఈ ఘటన నుంచి తనను కాపాడాలని సునీల్.. సింధును వేడుకున్నాడు. అంతేకాకుండా తాను నదియాకు దూరంగా ఉంటానని ప్రామిస్ చేశాడు. అయితే ఇందుకు అంగీకరించిన సింధు.. ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి పిల్లాడి శవాన్ని బెడ్ షీట్‌లో చుట్టారు. సునీల్ తన ఫ్రెండ్ వద్ద నుంచి కారు తీసుకొచ్చి.. అందులో బాలుడి మృతదేహాన్ని ఉంచారు. ఆ తర్వాత తమిళనాడులోకి బర్గూర్ అటవీ ప్రాంతంలో పడవేశారు.

    ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లిన నూతన దంపతులు.. ఉదయం అరుస్తూ బయటకు పరుగులు తీసిన నవ వధువు.. అసలేం జరిగిందంటే..

    ఇక, ఇంట్లో బాలుడు మిస్సింగ్ అయినట్టు సింధు, సునీల్‌లు చెప్పారు. అయితే వీరు బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులను ఆశ్రయించలేదు. రోజులు గడుస్తున్న బాలుడి ఆచూకీ లభించకపోవడంతో.. సింధు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు సునీల్.. ఆగస్టు 26వ తేదీన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి తన కొడుకు కనబడటం లేదని చెప్పాడు. అయితే ఫిబ్రవరిలో కనిపించకుండా పోయిన బాబు గురించి ఆగస్టులో ఫిర్యాదు చేయడంతో.. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని పోలీసులు భావించారు.

    Sad: అనాథగా ఉన్న ఈమెను చేరదీసింది.. ప్రేమగా పెంచింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

    దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరించారు. ఈ సమయంలో నదియాతో సునీల్‌కు వివాహేతర సంబంధం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. అలాగే సునీల్ బాలుడి మిస్సింగ్‌ గురించి పొంతన లేని విధంగా మాటలు చెప్పాడు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి కనిపించకుండా పోయాడని తెలిపారు. అయితే పోలీసులు సునీల్ ఫ్రెండ్‌ను విచారించగా.. బాలుడు అసలు తమ ఇంటికి ఎప్పుడూ రాలేదని అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు సునీల్, నదియాలను విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సునీల్, నదియా, సింధులను అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: