కరోనా కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి డబ్బు సంపాదన కోసం కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారాడు. గంటకు వేల రూపాయలు సంపాదించడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానంతో.. భార్య నిఘా పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కథ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాలు.. రాకేష్(27), సౌమ్య(పేర్లు మార్చడం జరిగింది) లు చూడగానే ఒకరి ప్రేమలో ఒకరు పడిపోయారు. తొలుత వీరిద్దరు 2017లో బెంగళూరులోని వారు పనిచేస్తున్న బీపీవో క్యాంటీన్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. చివరకు 2019లో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో రాకేష్ తన జాబ్ కోల్పోయాడు. దీంతో ఇతర అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు.
అయితే కొన్ని రోజులకు రాకేష్ ప్రవర్తనపై సౌమ్యకు సందేహం వచ్చింది. భర్త ఎక్కువగా ల్యాప్‌టాప్, ఫోన్లలో బిజీగా గడపటం ఆమెలో మరింత అనుమానాన్ని పెంచింది. దీంతో ఆమె ఎలాగైనా భర్త ల్యాప్‌ట్యాప్‌ను ఓపెన్ చేసి చూడాలని అనుకుంది. ఇందుకు తన సోదరుడి సాయం తీసుకుంది. నవంబర్‌లో సోదరుడి హెల్ఫ్‌తో సౌమ్య తన భర్త ల్యాప్‌ట్యాప్‌ను ఓపెన్ చేసి చూసింది. అందులో గ్రాఫిక్ ఫొటోస్ పేరుతో ఓ ఫోల్డర్ ఉండటం గమనిచింది. సీక్రెట్ ఫోల్డర్‌లో ఆమె భర్త న్యూడ్ ఫొటోలతో పాటు, తనకు తెలియని అమ్మాయిల సెమీ న్యూడ్ ఫొటోలు, సెల్ఫీలు ఉండటం గుర్తించింది. చివరకు తన కమర్షియల్ మేల్ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్నట్టు తెలుసుకుంది. గంటకు రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు సంపాదిస్తున్నాడని.. అతనికి నగరంలో చాలా మంది క్లైయింట్స్ ఉన్నారని కూడా కనుగొంది.
ఈ విషయంపై తన భర్తను సౌమ్య నిలదీసింది. అయితే అందులో ఉన్నది తాను కాదని బుకాయించే ప్రయత్నం చేశాడు రాకేష్. అయితే దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె మల్లేశ్వరమ్ పోలీస్ స్టేషన్‌లోని మహిళల హెల్ఫ్‌లైన్‌ని(Vanitha Sahayavani) ఆశ్రయించింది. ఇక, తాను ఉద్యోగం కోల్పోవడంతో సెక్స్ వర్కర్‌గా మారినట్టు విచారణలో రాకేష్ అంగీకరించాడు. తాను ఇప్పుడు చేస్తున్న పనిని ఎంతగానో ఇష్టపడుతున్నానని.. దీనిని తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు పరిచయం చేశారని వెల్లడించాడు.
ఈ క్రమంలోనే రాకేష్, సౌమ్య దంపతులకు నిపుణల చేత కౌన్సిలింగ్ ఇప్పించారు. సీనియర్ కౌన్సిలర్లు నాలుగు సార్లు ఈ జంటకు కౌన్సిలింగ్ నిర్వహించగా.. రాకేష్ వివాహ బంధం కొనసాగిస్తానని చెప్పాడు. తాను ప్రస్తుతం చేస్తున్న పనిని ఒదిలి పెడతానని అన్నాడు. అయితే సౌమ్య మాత్రం రాకేష్‌తో తెగదెంపులు చేసుకునేందుకే సిద్దపడింది. ఈ కమ్రంలోనే వారు పరస్పర అంగీకారంతో వివాహ బంధం రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Crime news