ఇది చాలా ఇళ్లలో జరిగే గొడవే.. కానీ, ఇంత దారుణానికి దారితీస్తుందని ఎవరూ అనుకోలేదు

ప్రతీకాత్మక చిత్రం

భర్త దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరిపోయింది. ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు. డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 • Share this:
  వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హాయిగా సంసారం చేసుకుంటున్నారు. అంతా బాగానే సాగింది. పిల్లలు పుట్టారు. కాలం గడిచిపోయింది. 12 ఏళ్లు గడిచాయి. ఇంతలో భర్తలో మార్పు వచ్చింది. ఓ చిన్న విషయంలో భార్య మీద దాడి చేశాడు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులోని బీటీఆర్ గార్డెన్ ప్రాంతంలో భార్యాభర్తలు ఉంటున్నారు. వారికి 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరి వయసు 11 సంవత్సరాలు, మరొకరి వయసు ఏడేళ్లు. గురువారం రాత్రి వారిద్దరికీ గొడవ జరిగింది. పెద్ద కొడుక్కి స్కూలు ఫీజు కావాలని భార్య అడిగింది. దీంతో భర్తకి కోపం వచ్చింది. ఆమె మీద దాడి చేశాడు. పదునైన వస్తువుతో కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది.

  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట కాపురం కొన్నాళ్లు బాగానే జరిగింది. గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తరచూ భర్త ఆమెను కొడుతున్నాడు. గురువారం రాత్రి కూడా ఇలాగే గొడవ జరిగింది. మూడో తరగతి చదువుతున్న పిల్లాడి స్కూలు ఫీజు చెల్లించాలని, అందుకు డబ్బులు కావాలని భర్తను ఆమె అడిగింది. స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లాడిని స్కూల్ కు రానివ్వరని చెప్పింది. కనీసం ఆన్ లైన్ క్లాసులు కూడా అటెండ్ కానివ్వరని చెప్పింది.

  స్కూల్ ఫీజుల విషయంలో భర్తకు, భార్యకు మధ్య గొడవ జరిగింది. కుటుంబం ఆర్థిక పరిస్థితికి భార్యే కారణం అని వాదించిన భర్త ఆమె మీద దాడి చేశాడు. అనంతరం కుర్చీతో కొట్టాడు. డైనింగ్ టేబుల్, గోడకి మధ్య ఉన్న ఖాళీలో పడేసి దాడి చేశాడు. ఈ దాడిలో కుర్చీ కూడా ఇరిగిపోయింది. అనంతరం సామాన్లు పెట్టుకునే స్టాండ్‌తో కొట్టాడు. తల్లి అరుపులు విన్న పెద్దకొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో కొడుకుని కూడా కొట్టాడు.

  భర్త దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరిపోయింది. ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు. డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: