Shocking: కూతురు అడ్మిషన్‌ కోసం స్కూల్‌కు వచ్చిన తల్లి.. కానీ అక్కడి హెడ్‌మాస్టర్ ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ స్కూల్ హెడ్ మాస్టర్ (School Head Master) చేసిన పాడుపని తీవ్ర కలకలం రేపింది. స్కూల్‌లో విద్యార్థి అడ్మిషన్ కోసం వచ్చిన ఆమె తల్లిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

  • Share this:
    ఓ స్కూల్ హెడ్ మాస్టర్ (School Head Master) చేసిన పాడుపని తీవ్ర కలకలం రేపింది. స్కూల్‌లో విద్యార్థి అడ్మిషన్ కోసం వచ్చిన ఆమె తల్లిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆమెతో స్కూల్‌లోనే మసాజ్((Massage in School) చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులోని కొదండరామాపురలో చోటుచేసుకుంది. వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఆధ్వర్యంలోని కొదండరామపూర హైస్కూల్‌లో(Kodandaramapura High School) లోకేషప్ప అనే వ్యక్తి హెడ్ మాస్టర్‌గా ఉన్నాడు. అతడు స్కూల్‌లో అడ్మిషన్‌ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో నీచంగా ప్రవర్తించాడు. ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అతడిని సస్పెండ్ చేశారు. అతడిపై డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించారు.

    ఈ ఘటనకు సంబంధించి బీబీఎంపీ స్పెషల్ కమిషనర్(ఎడ్యూకేషన్) శంకర్ బాబు రెడ్డి మాట్లాడుతూ.. ‘స్కూల్‌లో విద్యార్థి అడ్మిషన్ కోసం వచ్చిన తల్లితో స్కూల్ బిల్డింగ్‌లోనే మసాజ్ చేయించుకని విషయాన్ని లోకేషప్ప (Lokeshappa) అంగీకరించాడు. ప్రశ్నించిన సమయంలో తాను ఆ పని చేసినట్టుగా ఒప్పుకొన్నాడు. కర్ణాటక సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రభుత్వ పనివేళల్లో హైస్కూల్‌ను ప్రైవేట్ పని కోసం ఉపయోగించినందుకు, విధులను నిర్వీర్యం చేసినందుకు అతన్ని సర్వీస్ నుండి సస్పెండ్ చేశారు’అని తెలిపారు.

    Paper Boy Video: పేపరేస్తే తప్పేంటి?.. బాలుడు చెప్పిన మాటలకు కేటీఆర్ ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

    ఆ మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోందని.. తన కూతురు అడ్మిషన్ కోసం ఆమె స్కూల్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె లోకేషప్పను సంప్రదించారు. అయితే మహిళ నేపథ్యం గురించి తెలుసుకున్న లోకేషప్ప.. తనకు మసాజ్ చేయమని అడిగాడు. అయితే తన కూతరు అడ్మిషన్ కోసం ఒత్తిడికి గురైన మహిళ.. అతనికి మసాజ్ చేసేందుకు ఒప్పుకుంది. ఈ క్రమంలోనే లోకేషప్ప మిగిలిన వారిని బయటకు పంపి... క్లాస్‌రూమ్‌లో ఓ చోట చొక్కాను తీసేసి మసాజ్ చేయించుకున్నాడు. ఈ మేరకు India.com కథనాన్ని ప్రచురించింది.

    Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

    లోకేషప్ప అనైతిక కార్యకలాపాలు పాల్పడినట్టుగా అక్కడివారు చెబుతున్నారు. స్కూల్ సెక్యూరిటీ గార్డు కూతురితో కూడా అతడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన వెలుగుచూడంతో.. స్కూల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన సిబ్బంది, టీచర్స్ భయాందోళనకు గురవుతున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: