Home /News /crime /

BENGALURU DRUG ADDICT HUSBAND URINATES ON WIFES HEAD FIR REGISTERED AT BASAVANAGUDI WOMENS POLICE STATION PAH

OMG: తెలంగాణ మహిళపై అమానుషం.. నిద్రలో ఉన్న భార్యపై మూత్ర విసర్జన.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: వ్యక్తి డబ్బులో కోసం నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్లు తిడుతూ.. అనేక సార్లు దారుణంగా కొట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India
కొందరు వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకుని దారుణాలకు పాల్పడుతుంటారు. ఎక్కువ కట్నం తేలేదని, బంగ్లాలు, ఇళ్లు రాసివ్వలేదని నిత్యం భార్యలను వేధిస్తుంటారు. అంతటితో ఆగకుండా.. మరికొందరు భౌతిక దాడులకు కూడా దిగుతుంటారు. మరికొందరు తాగి ఇంటికి వచ్చి, భార్యలపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ఇంకొందరు.. కర్రీ వండలేదని, చికెన్ బాగాలేదని, కూరలో ఉప్పు ఎక్కువైందని కూడా గొడవలకు దిగుతుంటారు. అత్యంత దారుణాలు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka) బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. తెలంగాణకు చెందిన ప్రముఖ తెలంగాణ వస్త్ర పరిశ్రమ యజమాని కుమార్తె అయిన మహిళ.. గత జనవరిలో సందీప్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు కట్నకానుకల కింద అతనికి 6 కోట్లు సమర్పించుకున్నారు. అంతటితో ఆగకుండా తనకు ఇంకా కట్నం (Dowry harassment)  కావాలని నిత్యం భార్యను వేధించేవాడు. ప్రతిరోజు తాగి వచ్చి.. భార్యతో గొడవకు దిగేవాడు. రోజు స్నేహితులతో పూటుగా తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.



ఈ క్రమంలో.. అతను తన స్నేహితులను ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత.. భార్యతో గొడవకు దిగాడు. అంతే కాకుండా గదిలో నిద్రిస్తున్న మహిళపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో అతగాడి వేధింపులు భరించలేక సదరు మహిళ.. బెంగళూరులోని మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లి, భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka

తదుపరి వార్తలు