ఇంట్లోనే శవమైన భర్త... విషమంగా భార్య... తెలుగు దంపతులకు బెంగళూరులో ఏమైంది?

Bangalore Crime News : బెంగళూరులోని ఆ ఇంట్లో ఏం జరిగిందన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 10:25 AM IST
ఇంట్లోనే శవమైన భర్త... విషమంగా భార్య... తెలుగు దంపతులకు బెంగళూరులో ఏమైంది?
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 10:25 AM IST
ఆంధ్రప్రదేశ్... అనంతపురానికి చెందిన 31 ఏళ్ల రవి తేజా, అతని 29 ఏళ్ల స్వాతి రవి... ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వారికి సంతానం లేదు. బెంగళూరు... MG రోడ్‌లోని ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు రవి. స్వాతి... ఇంట్లోనే ఉంటోంది. అటు రవి, ఇటు స్వాతీ ఇద్దర్లో ఎవరూ తన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకపోయేసరికి... రవి సోదరి వాళ్ల ఇంటికి వెళ్లింది. ఎంతకీ తలుపు తియ్యకపోవడంతో... పక్కింటి వారి సాయంతో రాత్రి పది గంటలకు తలుపు బద్ధలు కొట్టింది. భార్యా భర్తలిద్దరూ... బాత్ రూం ఫ్లోర్‌పై పడివున్నారు. ఇద్దర్నీ దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. రవి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. స్వాతిని మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

తమకు పిల్లలు లేరన్న కారణంగా... రవి, స్వాతి... చాలా ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. ఏడాది కాలంగా వాళ్లు ఫ్యామిలీకి సంబంధించిన ఏ శుభకార్యాలకూ వెళ్లట్లేదు. ఇటీవల తనకు రొమ్ములో నొప్పి వస్తున్నట్లు రవి... బంధువులకు తెలిపాడు. అందువల్ల భార్యాభర్తలిద్దరూ విషం తాగి ఉండాలి. లేదా... హార్ట్ ఎటాక్‌తో రవి చనిపోవడంతో... అది తట్టుకోలేక స్వాతి విషం తాగి వుంటాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేగానీ ఏం జరిగిందీ తెలియదంటున్నారు పోలీసులు.

నిజానికి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రవి తన సిస్టర్‌కి కాల్ చేసి, రాత్రి ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. రాత్రి 7 గంటలకు ఆమె రవి ఇంటికి వెళ్లింది. ఎన్నిసార్లు కాల్ చేసినా రవి పలకకపోయే సరికి... ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి రాత్రి 10 గంటలకు కాల్ చేసినా, ఎవరూ పలకకపోవడంతో... రెండోసారి ఆ ఇంటికి వెళ్లినట్లు ఆమె వివరించింది. దీన్ని బట్టీ... రవి 7 గంటలకు ముందే చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. దర్యాప్తులో నిజానిజాలు బయటపడే అవకాశాలున్నాయి.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...