మసాజ్ సెంటర్‌లో విదేశీ వనితల కలకలం...భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు...

భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు...స్పా లో రహస్యంగా విదేశీ మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.

news18-telugu
Updated: February 21, 2020, 7:27 PM IST
మసాజ్ సెంటర్‌లో విదేశీ వనితల కలకలం...భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు...
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...(File)
  • Share this:
బెంగళూరు నగరంలో మసాజ్ సెంటర్ స్పా మాటున సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టును బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ గ్రామంలో నిర్వహిస్తున్న స్పా లో రహస్యంగా విదేశీ మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం రొంపి నుంచి ఆరుగురు మహిళలను కాపాడారు. పోలీసులు నిర్వహించిన డికాయ్ ఆపరేషన్ లో భాగంగా, విటుడి రూపంలో ఓ పోలీసు వెళ్లి యువతిని బుక్ చేసుకొని, లోపలి నుంచి పోలీసులకు కబురు పెట్టాడు. దీంతో వారు వచ్చి రెయిడ్ చేయగా, పోలీసులు స్పా నిర్వాహకులైన ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్పా బాగోతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు