Watch Video: నగర రోడ్లపై 300 కి.మీ వేగంతో బైక్ నడిపి...కటకటాల వెనక్కి..

బెంగుళూరులోని ఓ రోడ్డుపై యమహ బైక్‌ను‌‌ 300 కి.మీ వేగంతో నడిపి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బైక్ రేసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని బైక్‌ను సీజ్ చేశారు.

news18-telugu
Updated: July 21, 2020, 6:06 PM IST
Watch Video: నగర రోడ్లపై 300 కి.మీ వేగంతో బైక్ నడిపి...కటకటాల వెనక్కి..
300 కి.మీ వేగంతో బైక్‌ నడుపుతున్న బైక్ రేసర్..
  • Share this:
కొందరు బైక్ రేసర్లు తమ ప్రాణాలతో పాటు రోడ్లపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. నగరంనిలో రోడ్లపైనే అత్యంత వేగంగా తమ బైకులు నడుపుతూ ప్రమాదాల బారినపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా...వీరిలో మాత్రం పరివర్తన రావడంలేదు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో బోర్ కొడుతోందంటూ నగర రోడ్లపై రయ్ రయ్..మంటూ రోడ్లపై అత్యంత వేగంగా దూసుకెళ్తూ రోడ్లపై వెళ్తున్న ఇతరులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదే తరహా ఘటన తాజాగా బెంగుళూరులో జరిగింది. మునియప్ప అనే  బైక్ రేసర్ నగరంలోని ఓ హైవే పైన దాదాపు 300 కి.మీ వేగంతో బైక్ నడిపాడు. తనతో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడాడు. తానేదో గొప్ప కార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు చేరడంతో వారు సీరియస్ అయ్యారు. రోడ్డుపై సీసీటీవీల ఆధారంగా బైక్ నెంబర్ గుర్తించారు. సదరు బైకర్‌ను అరెస్టు చేయడంతో పాటు బైక్ రేసింగ్‌కు వాడిన యమహ 1000 సీసీ బైక్‌ను సీజ్ చేసినట్లు బెంగళూరు నగర జాయింట్ కమిషనర్(క్రైమ్) సందీప్ పాటిల్ తెలిపారు.



కాగా ఈ వ్యవహారంపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. 1000 సీసీల సామర్థ్యం కలిగిన బైక్స్‌ను రోడ్లపైకి ఎందుకు అనుమతి ఇస్తున్నారని? ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వీటిని బ్యాన్ చేయాలని కోరాడు. కాగా బైకర్ స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్ప...అత్యంత వేగంగా వాహనాలు నడిపే వారిని గుర్తించే వ్యవస్థ బెంగుళూరు పోలీసులకు లేకపోవడం దురదృష్టకరమని మరో నెటిజన్ పేర్కొన్నాడు. అత్యంత ప్రమాదకరంగా బైక్‌ను నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించి, ఇతరులకు కనువిప్పు కలిగించాలని మరో నెటిజన్ కోరాడు.
Published by: Janardhan V
First published: July 21, 2020, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading