ప్రియుడిపై పగబట్టిన ప్రేయసి... అతని మర్మాంగం కోసేసి పరార్...

ఎక్కడైనా ప్రియుడి కోసం ప్రాణాలు అర్పించే ప్రేయసి ఉంటుంది కానీ... ప్రియుడిపైనే ఆ ప్రేయసి ఎందుకు పగబట్టింది? వాళ్ల మధ్య ఏం జరిగింది.

news18-telugu
Updated: December 16, 2019, 8:25 AM IST
ప్రియుడిపై పగబట్టిన ప్రేయసి... అతని మర్మాంగం కోసేసి పరార్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఈ ట్విస్టుల కహానీకి కేరాఫ్ అడ్రెస్ అయ్యింది కర్ణాటకలోని బెంగళూరు. 2008లో జరిగిన ఈ దారుణానికి ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రియురాలికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. విషయమేంటంటే... వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం 32 ఏళ్లున్న ఆమె అప్పట్లో (2008లో)ఓ డాక్టర్. డెంటల్ క్లినిక్ నడిపేది. మైసూర్‌కి చెందిన మరో డాక్టర్‌ని ప్రేమించింది. అతనూ ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. విషయాన్ని ఇద్దరూ తమ తమ ఇళ్లలో చెప్పాలనుకున్నారు. చెప్పారు. ఆమె ఇంట్లో వాళ్లు సరే అన్నారు. అతని ఇంట్లో వాళ్లే ససేమిరా అన్నారు. ఎందుకో వాళ్లకు ఆమె నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమెకు చెబుదామని అనుకున్నాడు. కానీ ఆమె చాలా సెన్సిటివ్ అని భావించి... ఓ డ్రామా ఆడాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి... నెల తర్వాత ఆమె దగ్గరకు వచ్చి... నేను నిన్ను చేసుకోలేను అన్నాడు. ఏం ఎందుకు అంటే... నాకు కాన్సర్ ఉన్నట్లు తెలిసింది అన్నాడు. షాకైంది. నేను ఎన్నాళ్లో బతకను. నువ్వు నన్ను మర్చిపో అన్నాడు. ఆమె కాన్సర్ ఉన్నా పర్లేదు చేసుకుంటాను అంది. అమ్మో అనుకున్నాడు. వద్దు వద్దు అంటూ... అక్కడి నుంచీ వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత ఏ కనెక్షన్లూ లేవు.

ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయిని చేసుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. ఆమె మాత్రం అతన్ని మర్చిపోలేక... మనసు అల్లకల్లోలం అవుతుంటే... రోజూ బాధపడుతూ జీవించసాగింది.

కొన్ని నెలల తర్వాత

వన్ ఫైన్ డే... తన భార్యతో బైకుపై వెళ్తూ కనిపించాడు. ఆశ్చర్యపోతూనే పలకరించింది. తనకు కాన్సర్ లేదనీ, రిపోర్ట్ వేరే వాళ్లది తనకు వచ్చిందని నమ్మబలికాడు. ఇంట్లో వాళ్లు హడావుడిగా చేసేశారని మరో డ్రామా ఆడాడు. ఆమెకు విషయం అర్థమైపోయింది. కళ్ల వెంట నీళ్లు ప్రవాహంలా వస్తున్నా బలంగా వాటిని అణచేసుకొని... అక్కడి నుంచీ వెళ్లిపోయింది.

క్లినిక్‌కి వెళ్లి ఫుల్లుగా ఏడ్చేసింది. కాన్సర్ లేనప్పుడు తననెందుకు చేసుకోలేదని బాగా ఫీలైంది. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతాడా అని ఆమెలో ఆవేశం తన్నుకొచ్చింది. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే అనుకుంది. బాగా ఆలోచించి ఓ ప్లాన్ వేసింది. 2008 నవంబరు 29న కొత్త కపుల్‌ని క్లినిక్‌కి రమ్మని పిలిచింది. ఇద్దరూ హాయిగా వచ్చారు. ఇద్దరికీ మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఇద్దరూ మత్తులోకి జారుకున్నారు. తర్వాతేముంది... అతన్ని బెడ్ పై పడుకోబెట్టి... అతని మర్మాంగాన్ని కట్ చేసింది. తర్వాత అక్కడి నుంచీ పారిపోయింది. మత్తు వదిలాక... ఇద్దరికీ మైండ్ బ్లాంకైంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదంది. దర్యాప్తు జరిగింది. ఆమెను అరెస్టు చేశారు. కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఆమెకు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల ఫైన్ వేసింది. ఈ కేసులో అతను చేసింది క్షమించరాని తప్పే. కానీ... ఆమె చేసిన పని వల్ల మరో యువతి జీవితం నాశనమైపోయింది. అలాగే నేరం చేసినందుకు ఇప్పుడామె పదేళ్లు జైల్లో ఉండాలి. అంటే ఆమె జీవితం కూడా నాశనమైపోయినట్లే. ఆవేశపు నిర్ణయాలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: December 16, 2019, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading