ఫేమస్ నటి పల్లబిడే (Pallabi Dey) ఆదివారం అనుమానస్పద రీతిలో చనిపోయారు. తన స్నేహితుడితో షాగ్నిక్ చక్రవర్తితో కలిసి కోల్ కతాలోని ఒక అద్దెభవనంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఆదివారం, అనుమానస్పద రీతిలో చనిపోయాయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, షాగ్నిక్ షాపులో వెళ్లి వచ్చే వరకు.. పల్లబిడే ఉరి వేసుకుని దూలానికి వేలాడుతు ఉండటాన్ని అతను చూశాడు. దీంతో షాక్ కు గురై, చుట్టుపక్కల వారిని పిలిచాడు.
ఆ తర్వాత.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 24 నుంచి పల్లబిడే తన స్నేహితుడు షాగ్నిక్ చక్రవర్తితో కలిసి దక్షిణ కోల్కతాలోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల ఆమె స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకొవడం వెనుక ఖచ్చితమైన కారణాలు మాత్రం బయట పడలేదు. పల్లబి డే.. (Pallabi Dey) అమీ సిరాజేర్ బేగం , మోన్ మనే నా.. అనే టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. తమ ఫేవరేట్ నటి అకాల మరణంతో ఆమె అభిమానులు షాకింగ్ కు గురయ్యారు. ఈ మేరకు అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.