హోమ్ /వార్తలు /క్రైమ్ /

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కార్మికుడు నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉండగా, సరదాగా సహకార్మికులు అతణ్ని పట్టుకుని, మలద్వారంలోకి పైపును పెట్టి గాలిని పంప్ చేశారు. ‘మజాక్ మజాక్ మే రజాక్ మర్ గయా’సామెతలాగా కొన్నిసార్లు సరదాగా చేసే పనులే ప్రమాదానికి దారితీస్తాయి. ఫన్ కోసం తోటి కార్మికుడి మలద్వారంలోకి గాలిని పంప్ చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...

అదొక జనపనార మిల్లు.. జూట్ బ్యాగులు, బస్తాలు తయారయ్యే ఆ ఫ్యాక్టరీలో నిత్యం దుమ్మురేగి ఉంటుంది. మాస్కులు పెట్టుకుని పనిచేసే కార్మికులు.. డ్యూటీ దిగి ఇంటికెళ్లే ముందు తల, దుస్తులకు అంటిన దుమ్మును తొలగించుకుంటారు. కొన్నిసార్లు ఎయిర్ ప్రెషర్ తోనూ వాళ్లూ క్లీనింగ్ చేసుకుంటారు. గట్టి ఫోర్సుతో వచ్చే గాలిని ఇలాంటి పనులకు వాడొద్దని ఫ్యాక్టరీల్లో ఆంక్షలు ఉన్నా కచ్చితంగా అమలుకావు. అదిగో ఆ హైప్రెషర్ ఎయిర్ ను ఏకంగా ఓ వ్యక్తి మలద్వారంలోకి పంప్ చేశారు అతని తోటి కార్మికులు. కేవలం సరదా కోసం చేసిన ఈ పని చివరికి ప్రాణాపాయానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) లో జూట్ మిల్లుల కేంద్రమైన హుగ్లీ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలివి..

పని ప్రదేశంలో కార్మికులు జోకులు వేసుకోవడం, ఒకర్నొకరు ఆటపట్టించుకోవడం సహజమే. అయితే, ‘మజాక్ మజాక్ మే రజాక్ మర్ గయా’సామెతలాగా కొన్నిసార్లు సరదాగా చేసే పనులే ప్రమాదానికి దారితీస్తాయి. ఫన్ కోసం తోటి కార్మికుడి మలద్వారంలోకి గాలిని పంప్ చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. రహ్మత్ అలీ అనే కార్మికుడు నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉండగా, సరదాగా సహకార్మికులు అతణ్ని పట్టుకుని, మలద్వారంలోకి పైపును పెట్టి గాలిని పంప్ చేశారు. అంతే..

hyderabad : శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు -ఈ కిలేడీది మామూలు రేంజ్ కాదు మరి!



హైప్రెషన్ గాలి మలద్వారం గుండా లోని వెళ్లడంతో రహ్మత్ అలి అక్కడిక్కడే కుప్పకూలాడు. అప్పటిదాకా నవ్వులు వినిపించిన ఫ్యాక్టరీలో ఒక్కసారే వాతావణం మారిపోయింది. స్పృహకోల్పోయిన రహ్మత్ ను తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గడిచిన 10 రోజులుగా కొట్టుమిట్టాడిన అతను నిన్న శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. గాలి ఒత్తిడి కారణంగా రహ్మత్ కాలేయం పూర్తిగా పాడైపోయిందని, శరీరంలోని ఇతర భాగాలూ దెబ్బతిన్నాయని, ఎంతగా ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదని డాక్టర్లు చెప్పారు. కాగా,

Omicron : మళ్లీ మూసివేత దిశగా! -pm modi అత్యవసర భేటీ -భయానక ఒమిక్రాన్ భారత్‌‌లోకి వస్తే అంతేనా!!



రహ్మత్ అలీ మరణంపై అతని కుటుంబీకులు భద్రేశ్వర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఫ్యాక్టరీలో మలద్వారం గుండా గాలిని పెట్టడానికి తోటివాళ్లు ప్రయత్నించినప్పుడు రహ్మత్ తీవ్రంగా ప్రతిఘటించాడని, అయినాసరే తోటి కార్మికులు అతణ్ని వదల్లేదని వారు ఆరోపిస్తున్నారు. దిక్కు కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. రహ్మత్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సహోద్యోగి షాజాదా ఖాన్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఖాన్.. మిల్లులో జ్యూట్‌ను ఎయిర్ పంప్‌తో శుభ్రం చేస్తాడని, ఆ పైపుతోనే రహ్మత్ మలద్వారంలోకి ఎయిర్ పంప్ చేశాడని వెల్లడైంది. కాగా, జూట్ మిల్లు కార్మికుడి మరణంపై యాజమాన్యం ఇప్పటిదాకా నోరు తెరవలేదు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Crime news, West Bengal

ఉత్తమ కథలు